దేశంలోనే తొలిరాష్ట్ర: గోవధ వ్యతిరేక చట్టంను సవరించనున్న మధ్యప్రదేశ్
భోపాల్ : దేశంలో గోవులను చంపేస్తున్నారన్న అనుమానంతో చాలామందిపై గోసంరక్షకులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు మృతి కూడా చెందారు. ఇక గోసంరక్షణ చట్టంను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ అడుగు ముందుకేయనుంది. గోవధ వ్యతిరేక చట్టంను సవరించాలని కమల్‌నాథ్ సర్కార్ భావిస్తోంది. హింస, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారిపై, ఆస్తుల ధ్వంసం చేసిన వారిపై ఎలాంటి శిక్ష అమలు చేయాలనేదానిపై చట్టసవరణ చేయనున్నారు. ఇలా చేస్తే దేశంలోనే గోసంరక్షణ చట్టం అమలు చేసే రాష్ట్రాల్లో తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించనుంది.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించిన వారికి మూడేళ్లు వరకు జైలు శిక్ష ఉండేలా చట్టాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక తర్వాత కూడా ఇలాంటి చర్యలకు దిగితే ఐదేళ్లు జైలుశిక్ష విధించనున్నట్లు కమల్‌నాథ్ సర్కార్ చట్టాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లో చర్చించడం జరిగిందని కేబినెట్ ఇందుకు ఆమోదం తెలిపితే అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లును పాస్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం గోవధకు సంబంధిచిన నేరాలు ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయి.

సామూహిక దాడులతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సుప్రీంకోర్టు గతేడాది జూలైలో తీర్పు వెల్లడించింది. మాబ్ లించింగ్‌కు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అదేసమయంలో గోవధ పేరుతో వ్యక్తులపై కొందరు దాడి చేయడం సరైన పద్ధతి కాదని చెప్పిన సుప్రీంకోర్టు... ఇలాంటి ఘటనలు అరికట్టేందకు కేంద్రం కొత్తగా చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది.ఇటువంటి నేరాలను ఎదుర్కోవటానికి "నివారణ, పరిష్కార మరియు శిక్షాత్మక చర్యలు" అందించాలని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications