కౌంటింగ్ వేళ.. విజయ్ కు బిగ్ రిలీఫ్

తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ కూడా మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ నూతన రాజకీయ శక్తిగా రంగప్రవేశం చేయడం దీనికి ప్రధాన కారణం. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది. గెలుపోటముల అంతర్యాన్ని తగ్గించడమే కాకుండా, ఫలితాలను తారుమారు చేయగలిగుతుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ పరిణామాల మధ్య విజయ్ కు భారీ ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విజయ్ ప్రకటించిన ఆస్తుల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ తో విచారణ జరిపించాలని కోరుతూ తాజాగా దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఎస్ఏ ధర్మాధికారి, జీ అరుళ్ మురుగన్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. వివరణాత్మక ఉత్తర్వులను త్వరలో వెలువరిస్తామని తెలిపింది.

Madras HC Rejects Plea Alleging Asset Declaration Irregularities by Vijay Ahead of TN Vote Count

ఈ పిటిషన్‌ను చెన్నైకి చెందిన ఎంపీ వెంకటేష్ దాఖలు చేశారు. గతంలోనూ విజయ్ ఆస్తి ప్రకటనలలోని వ్యత్యాసాలపై ఐటీ దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై అప్పట్లో కోర్టు ఐటీ శాఖకు నోటీసులను ఇచ్చిన విషయం తెలిసిందే. భార్యకు 12.6 కోట్ల రూపాయల రుణం, ఒక ట్రస్ట్‌ 20 కోట్ల రూపాయలను బదిలీ చేసినట్లు విజయ్ తన తాజా ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారని, ఈ లావాదేవీల స్వభావం, దీని మూలంపై స్పష్టత లేదని వెంకటేష్ ఆరోపించారు.

ఈ వివరాలన్నీ కూడా ఆర్థిక గోప్యతకు సంబంధించినవని గుర్తు చేశారు. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఆదాయ వివరాలను వాటి మూలాలతో సహా వెల్లడించాల్సి ఉంటుందనేది కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు చెబుతున్నాయని వెంకటేష్ పేర్కొన్నారు. దీనికి భిన్నంగా విజయ్ ఆస్తుల అఫిడవిట్ ఉందని అన్నారు. ఇది పూర్తి సమాచారాన్ని దాచిపెట్టినట్టుగా కనిపిస్తోందని వాదించారు.

ఫారం 26 కింద పూర్తి వెల్లడి చేయాలన్న చట్టబద్ధ నిబంధనను, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 33ఏను ఉల్లంఘిస్తుందని, సెక్షన్ 125ఏ కింద శిక్షార్హమని, ఓటరు ప్రాథమిక హక్కును హరిస్తుందని ఆయన న్యాయస్థానానికి వివరించారు. దీనిపై తాజా పిటీషన్ అక్కర్లేదని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై త్వరలో వివరణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+