రిసార్ట్ ఎమ్మెల్యేల బలపరిక్ష: సీఎం, స్పీకర్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఇప్పుడు తన కుర్చీ కాపాడుకోవడానికి న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఎలాగైనా ఆయన్ను పదవి నుంచి తప్పించాలని తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీ న్యాయపోరాటం చెయ్యాలని సిద్దం అయ్యింది.
ఎడప్పాడి పళనిసామి ఎలా ముఖ్యమంత్రిగా బలపరిక్షలో నెగ్గారు, స్పీకర్ తీసుకున్న చర్యలు ఏమిటీ, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవాలు ఏమిటి, అధికారులు అసెంబ్లీలో ఎలా వ్యవహరించారు అని సమాధానం చెప్పాలని మద్రాసు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 10వ తేది
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, స్పీకర్ ధనపాల్, ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, సచివాలయం కార్యదర్శికి మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హెచ్. రమేష్, జస్టిస్ ఆర్. మహదేవన్ లతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.

అన్నాడీఎంకే పార్టీ బలపరిక్ష
మార్చి 10వ తేది లోపు మీరు కౌంటర్ దాఖలు చెయ్యాలని మద్రాసు హైకోర్టు నోటీసులో స్పష్టం చేసింది. గత శనివారం తమిళనాడు అసెంబ్లీలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రిగా బలపరిక్షలో నెగ్గారని స్పీకర్ ధనపాల్ ప్రకటించారు.

మమ్మల్ని కొట్టించారు
89 మంది ఎమ్మెల్యే మీద దాడి చేయించి మాబట్టలు చింపేసి సచివాలయం నుంచి బయటకు నెట్టేశారని ఆరోపిస్తూ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసింది.

ఎడప్పాడి బలపరిక్ష చెల్లదు
ప్రతిపక్షాలు లేకుండా, సొంత పార్టీల ఎమ్మెల్యేలను బయపెట్టి ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి అయ్యారని, సీక్రెట్ ఓటింగ్ కు అనుమతి ఇవ్వకుండా స్పీకర్ ధనపాల్ అధికార పార్టీకి మద్దతుగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారని డీఎంకే పార్టీ ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది.

ఇరకాటంలో అధికారులు
డీఎంకే పార్టీ వేసిన పిటిషన్ విచారించిన మద్రాసు హై కోర్టు సీఎం, స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చెయ్యడంతో అధికార పార్టీ నాయకులు ఎలా ఉన్నా అధికారులు మాత్రం కోర్టుకు ఏం సమాధానం చెప్పాలి అంటూ తలలు పట్టుకుంటున్నారు. డీఎంకే పార్టీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఇటు అధికార పార్టీ నాయకులు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.

వదిలిపెట్టం: ప్రతిపక్ష నాయకులు
అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని డీఎంకే పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలా చేస్తే ఎంతవరకైనా న్యాయపోరాటం చెయ్యాలని డీఎంకే పార్టీ నాయకులు సిద్దం అయ్యారు.

మౌనంగా పన్నీర్ సెల్వం వర్గం ఎత్తులు
ఎడప్పాడి పళనిసామికి మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యాలని పన్నీర్ సెల్వం వర్గీయులు పావులుకదుపుతున్నారు. ఎలాగైనా ఏడు మంది ఎమ్మెల్యేలను తన వర్గంలోకి చేర్చుకుని ఎడప్పాడి పళనిసామిని సీఎం కుర్చీలో నుంచి కిందకు దించి శశికళకు సినిమా చూపించాలని ప్లాన్ వేస్తున్నారు.












Click it and Unblock the Notifications