Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కన్న కూతురిపై లైంగిక వేధింపులు,భార్యే భర్తను ఇలా....కుట్ర పన్నారన్న భర్త..

కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తండ్రికి జీవిత ఖైదును విధిస్తూ మద్రాస్ కోర్టు తీర్పును వెలువరించింది.

చెన్నై:కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదును విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పును వెలువరించింది. కింది కోర్టు విధించిన శిక్షను మద్రాసు కోర్టు సమర్థించింది.నిందితుడిపై భార్యే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రంలోని ఈ ఘటన చోటుచేసుకొంది.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన తండ్రి తన 12 ఏళ్ళ కూతురిని లైంగికంగా వేధించేవాడు.ఈ విషయాన్ని అతని భార్య గమనించింది. పద్దతిని మార్చుకోవాలని ఆమె హెచ్చరించింది.

కాని, అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.2013 నవంబర్ 14వ, తేదిన ఆయనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆదారంగా పోలీసులు నిందితుడిపై కేసునమోదుచేశారు.

 madras high court ordered to life sentence to father for rape on daughter

2016 జూన్ 4వ, తేదిన మహిళా కోర్టు తీర్పును వెలువరించింది.జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హకీమ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

తన భార్య తనను ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు నాగముత్తు, ఆదినాథన్ లతో కూడిన ధర్మాసనం బాధితురాలికి తండ్రి చేస్తోన్న పనులు తెలియని వయసుగా వ్యాఖ్యానించింది.

నేరనిర్థారణ కావడంతో నిందితుడికి కింది కోర్టు విధించిన శిక్షను మద్రాస్ కోర్టు సమర్థించింది.మద్రాస్ కోర్టు కూడ ఇదే తీర్పును చెప్పడంతో నిందితుడికి జైలు జీవితం అనివార్యంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+