టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు విచారణ..మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఛాన్స్..

ఢిల్లీ : చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధం కొనసాగించాలా వద్దా అనే అంశంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సోమవారం ఈ అంశంపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం టిక్ టాక్ నిషేధంపై మద్రాస్ హైకోర్టు వైఖరేంటో స్పష్టం చేయాలని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 24న జరిగే విచారణలో తదుపరి ఉత్తర్వులు జారీ చేయకపోతే నిషేధాన్ని ఎత్తివేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి విచారణలో నిషేధంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Madras High Court to pass an interim order on the TikTok ban in India.

ఆశ్లీతత, విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు ఉన్నాయన్న కారణంగా మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 3న భారత్‌లో టిక్ టాక్ యాప్‌ డౌన్‌లోడ్‌ను బ్యాన్ చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. కోర్టు ఆదేశాలపై టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

పిటీషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నిషేధం కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 22న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు 24వ తేదీలోగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+