కూతురికి తాళి కట్టి, భార్య ముందే ఇంట్లో అత్యాచారం
మధురై: 12 ఏళ్ల సొంత కూతురుని లైంగికంగా వేధిస్తున్న 31 ఏళ్ల తండ్రిని తమిళనాడులోని మధురై పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ షాకింగ్ సంఘటన పైన బంధువులు ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం బాధాకరం.
నిందితుడైన ఆ తండ్రి తన పన్నెండేళ్ల కూతురికి మంగళసూత్రం కట్టాడు. ఆమెను తన రెండో భార్యగా చెప్పేవాడు. ఏడాదిగా ఆమె పైన అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తన భార్య, ఐదేళ్ల తన కూతురు, మరో చిన్నారి ఉన్న సమయంలోనే అతను అత్యాచారానికి పాల్పడేవాడు.

కూతురు పైన అత్యాచారం చేస్తున్న సంఘటనను ఎవరికైనా చెబితే అందర్నీ చంపేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది. పన్నెండేళ్ల ఆ కూతురు పైన అఘాయిత్యం కోసం ఇంటిలోని ఓ రూంలో కార్డ్ బోర్డ్ ఏర్పాటు చేసి సపరేట్ చేశాడు.
తన రెండో కూతురు ఎవరితోనైనా చెబుతుందనే భయంతో అతను ఆమెను కొట్టేవాడు. చంపేస్తానని బెదిరించేవాడు. ఓ సందర్భంలో బాధితురాలు తన విషయం చెప్పేందుకు సమయం వచ్చింది. ఆమె చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధితురాలిని కాపాడారు.












Click it and Unblock the Notifications