'అత్తారింటికిదారేది' నటుడికి మాఫియా బెదిరింపు, రక్షణ
ముంబై: అత్తారింటికి దారేది చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీకి మాఫియా నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో, ఆయనకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ముంబయి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి ఇరానీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
బొమన్ ఇరానీకి బెదిరింపులు వచ్చాయని అందుకే, ఆయనకు భద్రత కల్పిస్తున్నామని ముంబై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ప్రముఖులకు మాఫియా బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. నిర్మాత అలీ మొరానీ ఇంటి బయట కొందరు కాల్పులు కూడా జరిపారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌కు సైతం బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు ఇరానీకి అదే తరహాలో ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. బొమన్ ఇరానీ అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు తాతగా నటించారు.












Click it and Unblock the Notifications