దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు: పరుగులు తీసిన జనం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో మరోసారి భూ కంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో కొద్ది క్షణాలపాటు భూమి బలంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
భయంతో జనం తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ వీడియోలు పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆదివారం సాయంత్రం 4.08 గంటల సమయంలో ఢిల్లీ తోపాటు పొరుగున ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్‌లోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టారు స్కేలుపై 3.1గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.

కాగా, అక్టోబర్ 3న కూడా దేశ రాజధానిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
నేటి ప్రకంపనలు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో విస్తృతంగా ప్రభావం చూపాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో, హాపూర్, అమ్రోహాలో విస్తరించాయి. ప్రకంపనలు 40 సెకన్ల పాటు కొనసాగింది. చాలా మంది నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Earthquake of Magnitude:3.1, Occurred on 15-10-2023, 16:08:16 IST, Lat: 28.41 & Long: 77.41, Depth: 10 Km ,Location: 9km E of Faridabad, Haryana, India for more information Download the BhooKamp App https://t.co/bTcjyWm0IA @KirenRijiju @Dr_Mishra1966 @moesgoi @Ravi_MoES pic.twitter.com/gG5B4j3oBs
— National Center for Seismology (@NCS_Earthquake) October 15, 2023
నేపాల్‌లో ఉద్భవించిన రెండు భూకంపాలు త్వరితగతిన సంభవించిన సంఘటనల క్రమం ప్రేరేపించబడింది. మొదటి భూకంపం, 4.6 తీవ్రతతో నేపాల్‌లో మధ్యాహ్నం 2:25 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో నేపాల్‌ను తాకింది. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో మరింత శక్తివంతమైన ప్రకంపనలు 25 నిమిషాల తర్వాత 2:51 సమయంలో సంభవించాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications