ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: అయిదు రోజులే డ్యూటీ..అక్కడే ట్విస్ట్: కేబినెట్ భేటీలో..!
ముంబై: ప్రభుత్వ ఉద్యోగులకు మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇక వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలుగా నిర్దేశించింది. శని, ఆదివారాల్లో సెలవును ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకుని రానుంది. అక్కడే ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం. పని వేళలను పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఒక అదనంగా పని చేయాల్సి ఉంటుందంటూ ఉత్తర్వులను జారీ చేయవచ్చని సమాచారం.
ఈ మేరకు మహారాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో అయిదు రోజుల పనిని కల్పించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. మహారాష్ట్రలో సుమారు 20 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేసినట్లు మహారాష్ట్ర సమాచార శాఖ మంత్రి తెలిపారు.

Recommended Video
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మంత్రివర్గం ఈ ఉదయం సచివాలయంలో సమావేశమైంది. పలు కీలక అంశాలపై చర్చించింది. ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ), సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు (ఎస్ఈబీసీ), విముక్తి జాతి, నొమడిక్ ట్రైబ్స్ (వీజేఎన్‌టీ), ప్రత్యేక వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలను బహుజన కల్యాణ డిపార్టమెంట్‌గా పరిగణించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టనుంది.












Click it and Unblock the Notifications