Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇంకో 10 రోజులే.. కుంభ మేళా పోయిరావలె

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో అత్యంత విషాదకర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ సంభవించిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. మరో నలుగురు చిన్న పిల్లలు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించడానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ అది. శనివారం రాత్రి 9:55 నిమిషానికి 15వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీదికి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సీటు కోసం పోటీ పడ్డారు. అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు 12, 13, 14 ప్లాట్‌ఫామ్ మీదికి చేరుకోవడంతో తొక్కిసలాట సంభవించింది.

Maha Kumbh 2025 Devotees continue to throng to take holy dip in Triveni Sangam

ఈ పరిస్థితుల్లోనూ మహా కుంభ మేళా 2025కు లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ పోటెత్తుతోంది. దేశం నలుమూలల నుంచి కోట్లాదిమంది గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు.

ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లను దాటింది కూడా. కిందటి నెల 13వ తేదీన మహా కుంభమేళా ఆరంభమైన విషయం తెలిసిందే. 45 రోజుల పాటు అంటే ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగబోతోందీ అతిపెద్ద ఆధ్యాత్మికోత్సవం. దేశ విదేశాల నుంచి కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. త్రివేణి సంగమం ఘాట్లన్నీ కూడా పోటెత్తాయి.

భక్తల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింట్లో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపివేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్‌తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

విదేశీయుల తాకిడి సైతం మొదలైంది. ఈ తెల్లవారు జామున తొలి ఘడియలోనే రష్యా, క్రొయేషియా, బ్రిటన్, ఫ్రాన్స్‌కు చెందిన పలువురు భక్తులు త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటోన్నారు.

మహా కుంభ మేళాలో అమృత్ స్నానాన్ని ఆచరించడాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మకర సంక్రాంతి తొలి అమృత్ స్నాన పర్వదినం. దీని తరువాత మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘి పూర్ణిమ, మహా శివరాత్రి.. ఈ నాలుగు పుణ్య ఘడియల్లో తప్పనిసరిగా త్రివేణి సంగమ స్నానం చేయాలంటూ పురాణాల్లో ఉందని సాధవులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+