కోట్లమంది భక్తుల ఆకలి తీర్చుతున్న అదాని

Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.

45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్. ఈ నెల 20వ తేదీ వరకు 8.80 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. తొలి వారం రోజుల్లోనే ఏడు కోట్ల పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారికంగా వెల్లడించింది.

Maha Kumbh Mela 2025 Gautam Adani with ISKCON is offering free meals under the Mahaprasad Seva

పవిత్ర స్నానాలను ఆచరించడానికి ప్రయాగ్‌రాజ్ వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ రంగంలోకి దిగింది. దేశం నలుమూలల నుంచీ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నుంచీ ఆయా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటోన్నాయి. 13,000లకు పైగా ప్రత్యేక రైళ్లు ఆయా నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగించనున్నాయి.

కాగా- మహా కుంభ మేళాకు వచ్చే 50 లక్షల మంది భక్తుల ఆకలిని తీర్చడానికి దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదాని రంగంలోకి దిగారు. ఇస్కాన్ సహకారంతో మహా కుంభ మేళాలో ప్రత్యేకంగా మహా ప్రసాద సేవ అన్న వితరణ కార్యక్రమాన్ని కొద్దిసేపటి కిందటే ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇస్కాన్ ప్రతినిధి గురు ప్రసాద్ స్వామీజీ ఇందులో పాల్గొన్నారు.

మహా కుంభ మేళా ముగిసేంత వరకు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకూ అన్న ప్రసాద వితరణ కొనసాగుతుంది. మహాప్రసాద సేవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ ఉదయమే కుటుంబ సభ్యులతో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు గౌతమ్ అదాని. ఇస్కాన్ క్యాంప్‌లో అన్న వితరణ సేవలో పాల్గొన్నారు.

దీనికోసం ప్రత్యేకంగా రెండు వంటగదులను ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమం, స్నాన ఘట్టాలు.. వంటి వేర్వేరు ప్రాంతాల్లోమొత్తం 40 చోట్ల మహాప్రసాద అన్న వితరణ సేవ శిబిరాలను నెలకొల్పారు. వృద్ధులు, దివ్యాంగులు, పాలిచ్చే తల్లుల కోసం ఆయా శిబిరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికోసం గోల్ఫ్ కార్ట్‌లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.

అన్న వితరణ సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తోన్నందుకు ఇస్కాన్ ప్రతినిధులను ప్రశంసించారు అదాని. తోటి వారికి సేవ చేయడమే అత్యున్నతమని, మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఇస్కాన్ అక్షరాలా అమలు చేస్తోందని కితాబిచ్చారు. దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కలిగినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారాయన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+