మహా కుంభమేళా: త్రివేణి సంగమంలో గౌతమ్ అదానీ ప్రత్యేక పూజలు
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన కుటుంబసభ్యులతోపాటు మహా కుంభమేళాను సందర్శించారు. త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మం విలువలపై విశ్వాసం ఉన్న అదానీ కుటుంబసభ్యులు.. పవిత్ర గంగా ఆశీస్సులు కోరుతూ గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద ప్రార్థనలు చేసి, హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా అదానీ మాట్లాడుతూ.. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పాల్గొనడం అద్భుతమైన అనుభవాన్నిచ్చిందన్నారు. ఇక్కడ నిర్వహణ ఏర్పాట్లు అసాధారణంగా ఉన్నాయన్నారు. ఇందుకోసం దేశప్రజలందరి తరపున తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గంగమ్మ ఆశీర్వాదం కంటే తమకు ఏదీ గొప్పది కాదని అదానీ వ్యాఖ్యానించారు.

మహా కుంభమేళా సందర్శన, ఇక్కడికి వచ్చే కోట్లాది మందికి ఉచితంగా అన్నదానం చేయడం అనేది అదానీకి సనాతన ధర్మంతో ఆధ్మాత్మిక సంబంధాన్ని తెలియజేస్తోంది. ఆధ్యాత్మికత, సంస్కృతి గొప్ప సంగమం అయిన మహాకుంభమేళాలో ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో భక్తిప్రాపత్తులతో వచ్చే భక్తులకు తమవంతుగా అదానీ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు.
#MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani along with his family performs 'aarti' at Triveni Sangam, Prayagraj pic.twitter.com/tuwQlac4sU
— ANI (@ANI) January 21, 2025
ఈ నేపథ్యంలోనే అదానీ వినయం, నిస్వార్థ సహకారాన్ని ఆధ్యాత్మికవేత్త గురు ప్రసాద్ స్వామీజీ కొనియాడారు. 'కార్పోరేట్ బాధ్యత, సామాజిక సేవకు అదానీ గ్రూప్.. ఒక గొప్ప ఉదాహరణ. గౌతమ్ అదానీ వినయ విధేయలతో ప్రత్యేకంగా నిలుస్తారు. అదానీ సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు' అని స్వామిజీ ప్రశంసించారు.
#MahaKumbh2025 | Prayagraj, Uttar Pradesh: Adani Group Chairman, Gautam Adani along with his family offers prayers at Triveni Sangam, Prayagraj pic.twitter.com/SMzXmwxM0R
— ANI (@ANI) January 21, 2025
కాగా, మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ని సందర్శించడం, భక్తుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టంతో అదానీపై నలువైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సనాతన ధర్మం విలువలు, ఆధునిక నాయకత్వానికి మధ్య ఉన్న శాశ్వత సంబంధానికి ఉదాహరణగా అదానీ వ్యవహరించడం అందరినీ ఆకట్టుకుంది. అదానీ గ్రూప్‌కి, సేవ అనేది కేవలం అభ్యాసం మాత్రమే కాదు.. భారతీయ జీవన విధానం, వినయం, విశ్వాసం, నిస్వార్థ సేవలో లోతుగా ఇమిడిపోయినట్లు తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications