కొండలు, బీచ్‌లు కాదు: 2025లో భారతీయుల మనసులు దోచుకున్న ప్రదేశం ఇదే!

Year Ender 2025: 2025 ఏడాది ముగుస్తున్న తరుణంలో గూగుల్ తన వార్షిక 'ఇండియాస్ ఇయర్ ఇన్ సెర్చ్ 2025' నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. భారతీయుల ప్రయాణాల బకెట్ లిస్ట్ ఎంత వైవిధ్యంగా మారిందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది పర్యాటక రంగంలో ముఖ్యంగా అనుభవాల కోసం ప్రజలు ఎక్కువ ప్రయాణాలు చేశారు. అయితే భారతీయ ప్రయాణికులు కొండలు, బీచ్‌లు లేదా లగ్జరీ ప్రాంతాల కంటే కూడా ఒక ప్రత్యేకమైన అంశం పట్ల స్పష్టమైన మొగ్గు చూపారు.

ట్రెండింగ్ ట్రావెల్ సెర్చ్.. మహా కుంభమేళా!
గూగుల్ నివేదిక ప్రకారం.. 2025లో ఇండియాలో అత్యధికంగా ట్రెండింగ్‌లో ఉన్న ట్రావెల్ సెర్చ్‌లో అగ్రస్థానం దక్కించుకున్నది మరేదో కాదు, ఒక ఆధ్యాత్మిక మహాఘట్టం - అదే మహా కుంభమేళా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళా.. భారతీయుల కోసం ఓ సాంస్కృతిక, లోతైన వ్యక్తిగత అనుభవాన్ని అందించింది. ఇది కేవలం ట్రావెల్ ట్రెండింగ్ సెర్చ్‌లో మాత్రమే కాకుండా, 'టాప్ ట్రెండింగ్ సెర్చ్ ఫర్ న్యూస్ ఈవెంట్స్', 'టాప్ ట్రెండింగ్ సెర్చ్స్ ఓవరాల్' జాబితాలో కూడా చోటు దక్కించుకుంది.

Maha Kumbh Mela Tops Google India Most-Searched Travel Destinations of 2025

ఆధ్యాత్మిక పర్యాటకానికి గేమ్ ఛేంజర్
2025 మహా కుంభమేళా ఇండియాలో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని బలంగా ప్రభావితం చేసింది. ఈ మహా కుంభమేళా ఇండియాను గ్లోబల్ ఆధ్యాత్మిక పర్యాటక పటంలో పటిష్టంగా నిలబెట్టిందని ట్రావెల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ది వీఐటీఎస్ కమట్స్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ విక్రమ్ కమత్ ప్రకారం.. ఇంతకు ముందు ఆధ్యాత్మిక పర్యాటకం వృద్ధులకు సంబంధించినదిగా భావించేవారు. కానీ 2025 మహా కుంభమేళా యువ తరాలను కూడా ఆకర్షించింది. ఇది ఇండియా ఆధ్యాత్మిక సంప్రదాయాలతో వారికి జీవితకాల బంధాన్ని ఏర్పరిచింది. కుంభమేళా ద్వారా ప్రయాణికులు వారణాసి, రిషికేష్, బోధ్ గయ వంటి ఇతర ఆధ్యాత్మిక గమ్యస్థానాలను కూడా సందర్శించడానికి మొగ్గు చూపారు. ఆధ్యాత్మిక పర్యాటక తరంగానికి తోడుగా, మరొక ప్రధాన పుణ్యక్షేత్రమైన సోమనాథ్ కూడా టాప్ ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితాలో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది.

గూగుల్ టాప్ 10 ట్రావెల్ ట్రెండింగ్ సెర్చ్‌లు
ఆధ్యాత్మిక పర్యాటకం అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, బీచ్ ఎస్కేప్‌లు, అంతర్జాతీయ పర్యటనలు కూడా ప్రయాణ ప్రణాళికలలో ఆధిపత్యం చెలాయించాయి. 2025లో భారతీయులు ఎక్కువగా వెతికిన ప్రదేశాల జాబితాలో ముఖ్యమైనవి ఇవే.

1. మహా కుంభమేళా (భారత్)-ఆధ్యాత్మికం/ ఈవెంట్
2. ఫిలిప్పీన్స్- అంతర్జాతీయ/ సౌత్ ఆసియా
3. జార్జియా- అంతర్జాతీయ/ యూరోపియన్ ఎస్కేప్
5. కశ్మీర్ -దేశీయ/ పర్వతాలు
6. ఫు క్వాక్ (వియత్నాం) -అంతర్జాతీయ/ బీచ్
7. ఫుకెట్ (థాయిలాండ్)- అంతర్జాతీయ/ బీచ్
8. మాల్దీవులు-అంతర్జాతీయ/ ఐలాండ్
9. సోమనాథ్ (భారత్)- దేశీయ/ ఆధ్యాత్మికం
10. పుదుచ్చేరి- దేశీయ/ కోస్టల్

జార్జియా, కశ్మీర్ రెండూ 2024 సెర్చ్ జాబితాలలో కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+