Mahakumbh Mela 2025: విదేశీ భక్తుల పుణ్య స్నానాలు- జనసంద్రం..!!

మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ ఉదయం ప్రారంభమైన మహా కుంభమేళా 45రోజులపాటు జరగనుంది.12 ఏళ్లకో సారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది భక్తులు హాజరు కానున్నా రు. ఈ సారి విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇక్కడి సంప్రదాయాలను .. పద్దతులను అనుసరిస్తూ ఆస్వాదిస్తున్నారు. వి లవ్ ఇండియా అంటూ నినదిస్తున్నారు. ఈ రోజు పవిత్ర స్నానం కు మంచి రోజు కావటంతో ప్రయాగ్ రాజ్ జనసంద్రంగా మారింది.

త్రివేణీ సంగమం భక్తులతో నిండిపోయింది. నాగసాధువులతో పాటుగా విదేశీ భక్తులు పెద్ద సంఖ్య లో తరలి వచ్చారు. గడ్డ కట్టే నీటిలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఆస్వాదిస్తున్నారు. పుష్య పౌర్ణమి కావడం వల్ల ప్రయాగ్​రాజ్​లోని త్రివేణి సంగమం విదేశీ భక్తులు వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. రష్యా నుంచి విదేశీ భక్తులు మేరా భారత్ మహాన్ అంటూ ఈ గడ్డ పైన తమకు ఉన్న అభిమానం చాటుకున్నారు. కుంభమేళాలో మనం అసలైన భారత్ ను చూడవచ్చని చెప్పుకొచ్చారు. కుంభ మేళా జరిగే ప్రదేశంలో శక్తి ఉందని అభిప్రాయపడ్డారు. బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా చేరుకున్న టీం సభ్యులు పుణ్య స్నానాలు ఆచరించారు.

Mahakumbh Mela 2025 People from across the globe are Prayagraj to take holy dip at Triveni Sangam

త్రివేణి సంగమం వద్ద ఉన్న నీరు చల్లగా ఉందని, కానీ స్నానం చేసిన తర్వాత తన హృదయం వెచ్చదనంతో నిండిపోయిందని వారు పేర్కొన్నారు. యోగా చేస్తూ..మోక్షాన్ని వెతుకుతున్నట్లు వెల్లడించారు. కుంభమేళ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు స్పెయిన్ నుంచి వచ్చిన భక్తులు చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి టీంలుగా కలిసి కట్టుగా కుంభమేళాకు పలువురు తరలి వచ్చారు. అటు భక్తుల సంఖ్య పెరగటంతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బృందాలు కూడా సంఘటనా స్థలంలో పహారా కాస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+