దారుణం: లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో బిడ్డను కని.. బకెట్‌లో వదిలేసిన విద్యార్థిని

అప్పుడే హాస్టల్‌కు తిరిగొచ్చిన అమ్మాయిలకు.. బాత్రూమ్‌లో నుంచి వింత శబ్దాలు వినిపించాయి.. భయపడుతూనే దగ్గరికెళ్లి చూడగా.. రక్తంతో నిండిన బకెట్‌లో శిశువు కనిపించింది.. ఆ సీన్ చూసి షాక్ కు గురైన అమ్మాయి.. వెంటనే వార్డెన్ కు కబురుపెట్టారు.. తర్వాత పోలీసులు కూడా వచ్చారు.. మహారాష్ట్రలోని ధులే జిల్లా సక్రీలో వెలుగుచూసిన ఈ దారుణానికి సంబంధించి పోలీసుల వివరణ ఇది...

రహస్యంగా దాచి..

రహస్యంగా దాచి..


ధులే జిల్లా సక్రీలోని సావిత్రీబాయి ఫులే ఆదివాసి హాస్టల్ లో సుమారు 70 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వాళ్లలో ఐదో తరగతి నుంచి డిగ్రీ చదివేవాళ్లదాకా ఉన్నారు. 18 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థిని తాను గర్భం ధరించిన విషయాన్ని రహస్యంగా దాచింది. చిన్నవయసు కావడం, సరైన ఆహారంలేక బలహీనంగా ఉండటంతో ఆమె పరిస్థితిని ఎవరూ అంచనా వేయలేకపోయారు. తీరా గత నెల 29న ఆమెకు పురిటినొప్పులొచ్చాయి..

ఏం చెయ్యాలో తెలియక..

ఏం చెయ్యాలో తెలియక..

స్నేహితులకు కూడా చెప్పకుండా బాత్రూంలోకి పరుగులు తీసిన ఆ అమ్మాయి.. అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఏం చెయ్యాలో అర్థంకాక.. బిడ్డను బకెట్ లో వదిలేసి వెళ్లిపోయింది. కొన్ని గంటల తర్వాత మిగతా విద్యార్థులు.. బాత్రూమ్ లో నెత్తుటితో నిండిన బకెట్ లో శిశువును చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు...

ఇలా బయటపడింది..

ఇలా బయటపడింది..

ముందుగా ఆ తల్లిని కనిపెట్టే ప్రయత్నం చేశారు. హాస్టల్ లో ఉన్న అమ్మాయిలందరూ ఆ శిశువు ఎవరో తమకు తెలియదని చెప్పడంతో పోలీసులు ఒక్కొక్కరిని విడిగా విచారించారు. చివరికి ఒక అమ్మాయిపై అనుమానం వచ్చి, ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించగా.. బిడ్డను కన్నది ఆమేనని తేలింది. ప్రస్తుతం తల్లీబిడ్డలను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే..

Recommended Video

    Viral Video : Crazy Student Doing Homework On Bike | Oneindia Telugu
    కారణం ఎవరు?

    కారణం ఎవరు?

    18ఏళ్ల అమ్మాయి ఎవరి ద్వారా గర్భం ధరించిందన్న విషయాన్ని కూడా కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పేదరాలైన ఆ అమ్మాయిని ఎవరైనా మోసం చేశారా లేక ఇంట్లోనే లైంగికదాడికి గురైందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్త స్థానికంగా సంచలనం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+