ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్: బాలీవుడ్ నటిపై కేసు ఫైల్

ముంబై: బాలీవుడ్ నటి పాయల్ రోహ్తగీ చిక్కుల్లో పడ్డారు. చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. జాతీయ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఆమెపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఓ వివాదాస్పద వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందువల్ల ఆమెపై పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు. పాయల్ రోహ్తగీపై పుణేలో కేసు రిజిస్టర్ అయింది.

పాయల్ రోహ్తగీ పలు బాలీవుడ్ సిినిమాల్లో నటించారు. లైలా, 35 చైనా టౌన్, కార్పొరేట్, హే బేబీ, ఢోల్, వేలంటైన్స్ నైట్స్ వంటి మూవీల్లో మెరిశారు. ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గాయి. దీనితో టెలివిజన్ సీరియళ్లలో నటిస్తోన్నారు. సుమారు 20 టాప్ సీరియల్స్‌లో నటిస్తోన్నారు. హిందీలో బిగ్ బాస్‌లోనూ కంటెస్ట్ చేశారు. సర్వైవర్ ఇండియా 1 వంటి రియాలీటీ షోల్లో కనిపించారు. ప్రస్తుతం టీవీ సీరియళ్లకే పరిమితం అయ్యారు.

Maharashtra: A case has been registered against actress Payal Rohatgi in Pune

తాజాగా ఆమె జాతిపిత మహాత్మాగాంధీ, దివంగత ప్రధానమంత్రులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా దుమారాన్ని రేపింది. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పుణే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పుణేలోని శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153 (ఎ), 500, 505 (2), 34 కింద కేసు పెట్టారు. త్వరలోనే ఆమెకు నోటీసులను జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా- మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలపై చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేతలు పాయల్ రోహ్తగీపై మండిపడుతున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారనేది ఆరా తీయాలని డిమాండ్ చేస్తోన్నారు. జాతీయ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయ వద్దని కోరుతున్నారు.

శిక్ష పడకుండా వదిలేస్తే.. అలాంటి వారు మరి కొందరు పుట్టుకొస్తారని పుణే జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంగీత తివారీ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. మత కల్లోలాలు సృష్టించడానికి కారణం అయ్యేలా పాయల్ రోహ్తగీ ఈ వీడియోను పోస్ట్ చేశారని మండిపడ్డారు. రెండు సామాజిక వర్గాల మధ్య వైరం సృష్టించాలనేది ఆమె ప్రయత్నంలా కనిపిస్తోందని సంగీతా తివారీ ఆరోపించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఎవ్వరూ సమర్థించబోరని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+