కేకే సర్వే సంచలన నివేదిక..!!
Maharashtra Assembly exit Polls 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారంలోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145.
ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ మధ్య పోటీ నెలకొంది.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం మొదలుపెట్టాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంపై అంచనాలు బహిర్గతమౌతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్- మీడియా సంస్థలు ఉమ్మడిగా సాగించిన ముందస్తు అంచనాలు ఇవి.
మహారాష్ట్రలో మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కేకే సర్వే అంచనా వేసింది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది బీజేపీ- శివసేన- ఎన్సీపీ కూటమి. ఏకంగా 225 స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేసిందీ సర్వే. తన రాజకీయ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వబోదని తెలిపింది.
మహా వికాస్ అఘాడీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పకపోవచ్చు కేకే సర్వే ప్రకారం చూసుకుంటే. కేవలం రెండంకెలకే పరిమితమౌతుంది. 56 నియోజకవర్గాల కంటే ఎక్కువ సీట్లు మహా వికాస్ అఘాడీకి దక్కబోవు. ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగలరని తెలిపింది.
ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సునామీ తరహాలో విజయం సాధిస్తుందని కేకే సర్వే అంచనా వేసిన విషయం తెలిసిందే. 175 నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 161 స్థానాల్లో గెలుస్తుందనీ తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 14 సీట్లల్లో మాత్రమే విజయం సాధిస్తారని అప్పట్లో వెల్లడించింది. దీనికి అనుగుణంగా ఎన్నికల ఫలితాలు వెలువడటం అప్పట్లో సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications