సట్టా బజార్ బెట్ ఆ కూటమికే

Maharashtra Assembly exit Polls 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

మొత్తం 288 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారంలోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 144. ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ మధ్య పోటీ నెలకొంది.

Maharashtra assembly exit polls 2024 Phalodi Satta Bazar has forecasted the comeback of Mahayuti

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం మొదలుపెట్టాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంపై అంచనాలు బహిర్గతమౌతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్- మీడియా సంస్థలు ఉమ్మడిగా సాగించిన ముందస్తు అంచనాలు ఇవి.

ఫాలొది సట్టా బజార్ తన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేసింది. రాజస్థాన్‌కు చెందిన ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఇది. మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తెలిపింది. ఈ కూటమికి సంపూర్ణ మెజారిటీ లభిస్తుందని పేర్కొంది. 150 నుంచి 170 నియోజకవర్గాల్లో మహాయుటి జెండా రెపరెపలాడుతుందని సట్టా బజార్ అభిప్రాయపడింది.

మహా వికాస్ అఘాడి కూటమికి ఈ సారి కూడా పరాభవం తప్పకపోవచ్చనేది సట్టా బజార్ అంచనా. దీని ప్రకారం చూసుకుంటే ఈ ధఫా కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందీ కూటమి. వికాస్ అఘాడీకి 110 నుంచి 130 వరకు సీట్లు దక్కొచ్చని పేర్కొంది. ఇతరులు 8 నుంచి చోట్ల విజయం సాధిస్తారని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+