మరాఠా గడ్డపై కాషాయ పతాకం రెపరెపలు
Maharashtra Assembly exit Polls 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 288 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారంలోకి రావడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145.
ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. భారతీయ జనతా పార్టీ- శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం)కి చెందిన మహాయుటి, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)- కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ మధ్య పోటీ నెలకొంది.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం మొదలుపెట్టాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంపై అంచనాలు బహిర్గతమౌతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్- మీడియా సంస్థలు ఉమ్మడిగా సాగించిన ముందస్తు అంచనాలు ఇవి.
మహారాష్ట్రలో మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పోల్ ఆఫ్ పోల్స్ అంచనా వేసింది. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది బీజేపీ- శివసేన- ఎన్సీపీ కూటమి. తన రాజకీయ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వబోదు. అసెంబ్లీపై కాషాయ పతాకం రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తోంది.
మహా వికాస్ అఘాడీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పకపోవచ్చు పోల్ ఆఫ్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే. 113 నుంచి అసెంబ్లీ స్థానాలకే ఈ కూటమి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతరులు/స్వతంత్ర అభ్యర్థులు 10 నుంచి 15 చోట్ల విజయం సాధించగలరని ఈ ఎగ్జిట్ పోల్స్ తెలిపింది.












Click it and Unblock the Notifications