ఎవరు గెలిచినా బొటాబొటి మెజారిటే
Maharashtra Assembly exit Polls 2024: జార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 38 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి దశ పోలింగ్ ఈ నెల 13వ తేదీన ముగిసింది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రతో పాటు ఇక్కడి ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగింది. జార్ఖండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని ఇండియా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎవరు గెలుస్తారనేది 23వ తేదీన తేలిపోతుంది. మొత్తం 81 నియోజకవర్గాలు ఉన్న జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం 41.

పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం మొదలుపెట్టాయి. ఈ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంపై అంచనాలు బహిర్గతమౌతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్- మీడియా సంస్థలు ఉమ్మడిగా సాగించిన ముందస్తు అంచనాలు ఇవి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై టైమ్స్ నౌ- జేవీసీ తన అంచనాలు విడుదల చేసింది. ఇక్కడ ఇండియా కూటమికి ఓటమి తప్పదని పేర్కొంది. బొటాబొటి మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే బీజేపీ కూటమికి 40 నుంచి 44 నియోజకవర్గాలు లభిస్తాయి.
జేఎంఎం- కాంగ్రెస్ కూటమి గట్టిపోటీ ఇస్తుంది గానీ అధికారాన్ని మాత్రం అందుకోబోదు. ఈ కూటమికి 30 నుంచి 40 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఇతరులు ఒక్క చోట మాత్రమే తమ ప్రభావాన్ని చూపించగలరని టైమ్స్ నౌ అంచనా వేసింది. దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications