ఆ మాజీ సీఎం నా జీవితాన్ని నాశనం చేశాడు..నేనుండలేను: బీజేపీకి మాజీ మంత్రి రాజీనామా
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్న బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ దాదా పాటిల్‌కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. తాను వ్యక్తిగత కారణాలతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏకవాక్యంతో తేల్చారు. త్వరలోనే ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరబోతున్నారు.
ఈ మేరకు పార్టీ అధినేత శరద్ పవార్‌తో మంతనాలు కూడా పూర్తయ్యాయి. ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖాయం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శరద్ పవార్, అజిత్ పవార్ సమక్షంలో తాను ఎన్సీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో అధికారంలో మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ఎన్సీపీ భాగస్వామి. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఫలితంగా- ఏక్‌నాథ్ ఖడ్సేకు ఎన్సీపీ తరఫున మంత్రిపదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాను బీజేపీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం.. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఫడ్నవిస్ వల్ల తన రాజకీయ జీవితం నాశనమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫడ్నవిస్ వైఖరి వల్ల పలువురు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. తన తరువాత మరికొందరు సీనియర్ నేతలు రాజీనామా చేసే అవకాశం లేకపోలేదని చెప్పారు.
ఇదివరకు ఫడ్నవిస్ ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన బీజేపీలో కొనసాగారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తనకు బదులుగా కుమార్తె రోహిణీ ఖడ్సే ఖెల్వాల్కర్‌ను నిలబెట్టారు. ఆమె ఓడిపోయారు. ముక్తయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన రోహిణీ ఖడ్సే.. స్వతంత్ర అభ్యర్థి చంద్రకాంత్ నింబా పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తన కుమార్తె ఓటమికి దేవేంద్ర ఫడ్నవిస్ లోపాయకారిగా పనిచేశారని, స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారనే అసంతృప్తి ఏక్‌నాథ్ ఖడ్సేలో వ్యక్తమైంది. అప్పటి నుంచీ ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఎన్సీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Recommended Video
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications