సొంత పార్టీ లీడర్ రాసలీలల వీడియో లీక్, విచారణకు హోమ్ మంత్రి ఆదేశాలు. డీల్ !
ముంబాయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నడుస్తుండగా బీజేపీకి చెందిన సీనియర్ నేత కిరీట్ సోమయ్యకు చెందిన అసభ్యకరమైన రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దెబ్బకు బీజేపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. దీని తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రితోగా వ్యవహరిస్తూ హోమ్ శాఖను కూడా చూసుకుంటున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ వీడియో ప్రసారమైన తర్వాత అధికార కూటమి అసలు ముఖం ఇప్పుడు బయటపడింది అని ప్రతిపక్షాలు విమర్శించాయి. కానీ ఈ వీడియో ఫేక్, నేను ఏ స్త్రీని వేధించలేదు, విచారణ జరిపి తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు కిరీట్ సోమయ్య డిమాండ్ చేశారు.

అయితే వీడియోలో ఉన్న మహిళ ఇప్పటివరకు పోలీసులకు, బీజేపీ నాయకులకు ఫిర్యాదు చేయలేదు. ఆ మహిళ చట్టాన్ని నమ్మి ఫిర్యాదు చేయాలని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ నీలం గోర్ డిమాండ్ చేశారు. ఇంతలో, ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. వీడియోలో ఉన్న మహిళను కనుగొంటామని పోలీసు అధికారులు అంటున్నారు. బీజేపీ నాయకుడి రాసలీల వీడియో కేసు విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications