బారులో మందేస్తూ.. డ్యాన్సర్‌తో చిందులేస్తూ.. ఎమ్మెల్యే ఆగమాగం..!
ముంబై : ప్రజా ప్రతినిధిగా హుందాగా ప్రవర్తించాల్సిన ఓ లీడర్ దారి తప్పాడు. పది మందికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి అవాక్కయ్యేలా చేశాడు. పీకల దాకా తాగి తానా తందానా ఆడాడు. సాక్షాత్తూ ఎమ్మెల్యే బారులో మందు తాగుతూ ఆగమాగం చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ బార్ డ్యాన్సర్‌తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదస్పదమైంది. గాంధీ జిల్లాలోని ఆమ్‌గన్ డోరీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పురమ్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో నానా రచ్చ చేశాడు. మందు తాగి చిందులేశాడు.
Wowwww wht a govT bjP vidhansabha ...aamdar devri-amgaon sanjay puram @Dev_Fadnavis @PMOIndia @nitin_gadkari @BJP4India pic.twitter.com/kwYgYCBr5j
— Aniket (@jainaniket953) September 27, 2019

ఎమ్మెల్యే అని సోయి లేకుండా ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు. పీకల దాకా మద్యం తాగి బార్ డ్యాన్సర్‌తో చిందేశాడు. అంతేకాదు ఆమెపై డబ్బులు చల్లుతూ వికృత పోకడలకు పోయాడు. ఈ వీడియో కాస్తా బాగా వైరల్ కావడంతో స్థానికులు సదరు ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యేపై కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications