బల పరీక్ష నెగ్గిన ఏక్‌నాథ్ షిండే.. 164 ఓట్లతో విన్, అఘాడీ కూటమికి 99 ఓట్లు
మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో నెగ్గింది. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. దీంతో గత రెండు వారాలుగా జరిగిన ప్రతిష్టంభనకు తెరపడింది. అసెంబ్లీలో హెడ్ కౌంట్ లెక్కించి.. బలనిరూపణ కౌంట్ చేశారు. షిండే ప్రభుత్వానికి 164 ఓట్లు వచ్చాయి. వీరిలో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా మెజార్టీ సభ్యులు బీజేపీ, ఇండిపెండెంట్లు ఉన్నారు. మహా అఘాడీ కూటమికి 99 ఓట్లు వచ్చాయి.
Recommended Video


విప్ ధిక్కరించిన ఆదిత్య..
శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే విప్‌ను ఉల్లంఘించారు. శివసేన చీఫ్ విప్ భారత్ గొగవలే జారీచేసిన విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు అతను అనర్హత ప్రక్రియను ఎదుర్కొవలసి ఉంది. బలనిరూపణ సమయంలో మాజీ సీఎం అశోక్ చవాన్, సీనియర్ కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టిర్ తమ ఓటును తెలియజేయలేదు. థాకరే బృందంలోని ఎమ్మెల్యే సంతోష్ బంగార్.. షిండే వర్గంలో చేరారు. బలనిరూపణకు కొద్దీ నిమిషాల్లో ఇదీ జరిగింది. దీంతో షిండేకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నిక జరిగిన ఒకరోజు తర్వాత బలపరీక్ష జరిగింది. షిండే సహా 16 మందిని అనర్హులుగా ప్రకటించాలని కోరింది. అయినప్పటికీ యథా ప్రకారం బలనిరూపణ జరిగింది.

16 మంది రెబల్ ఎమ్మెల్యేలు
షిండే శివసేన పక్ష నేతగా నార్వేకర్ గుర్తించారు. అలాగే గొగవాలేను శివసేన చీఫ్ విప్‌గా ఎన్నిక చేశారు. అయితే 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ 16 మందిపై అనర్హత వేటు వేసినా.. షిండే ప్రభుత్వానికి సానుకూలంగా మారింది. ఎందుకంటే పూర్తి మెజార్టీ ఉంది.

40 మంది ఎమ్మెల్యేలు
గత నెల 20వ తేదీన షిండే తిరుగుబాటు ఎగరవేశారు. రోజు రోజుకు ఆయన మద్దతు పెరిగింది. అలా 39 మందికి చేరింది. చివరి క్షణంలో మరో ఎమ్మెల్యే చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు సభలో మెజార్టీ నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఉద్దవ్ థాకరేకు ఆదేశాలు జారీచేసింది. దాంతో ఆయన బుధవారం తన సీఎం పదవీకి రాజీనామా చేశారు. ఆ మరునాడు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. షిండేను సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్‌ను డిప్యూటీగా ఎంపిక చేసింది. ఇవాళ బలనిరూపణ జరిగింది.












Click it and Unblock the Notifications