మహా సీఎం షిండే, డిప్యూటీ అజిత్ బ్యాగుల తనిఖీ: ప్రతిపక్షాలకు కౌంటర్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఇటీవల శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే బ్యాగును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు జరుగుతున్నాయని ఉద్ధవ్ థాక్రే శివసేన, కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ నేతలు అధికార బీజేపీ-ఏక్‌నాథ్ శిండే శివసేన ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రతిపక్షానికి పలు వీడియోలతో కౌంటర్ ఇస్తోంది. తమ నాయకులను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారని పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బ్యాగును తనిఖీ చేశారు ఎన్నికల అధికారులు. తాజాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే బ్యాగును ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు.

Maharashtra Election 2024 EC Officials Frisk CM Eknath Shinde and DCM Ajit Pawar s bags

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి బ్యాగులను కూడా ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేస్తున్నారని ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తున్నారు అధికార పక్షం నేతలు. ప్రతిపక్ష నేతలను మాత్రమే తనిఖీ చేస్తున్నారంటూ ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తదితర నేతల హెలికాప్టర్లు ఎప్పుడైనా తనిఖీ చేశారా? అని ఎన్నికల కమిషన్‌ను ఉద్ధవ్ థాక్రే ప్రశ్నించారు.

మరోవైపు, ఉద్ధవ్ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరు రాజకీయ నాయకుల హెలికాప్టర్లను తనిఖీ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అగ్రనేత బ్యాగులను కూడా ఎన్నికల సిబ్బంది తనిఖీ చేస్తున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+