మహిళల ఖాతాల్లో రూ 1500 జమ - నేటి నుంచే..!!
సంక్షేమ పథకాల అమలు పైనే ప్రభుత్వాలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం జమ్ము కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో, ఓటర్లను ఆకట్టుకోవటానికి పథకాల పేరుతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ 1500 జమ చేసే పథకాన్ని రాఖీ పర్వదినం సందర్భంగా అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో మరో పథకం అమల్లోకి వస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ క్రమంలోనే మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అధికారం నిర్ణయించే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా నిలుస్తున్న మహిళలకు రాఖీ పర్వదినం సందర్భంగా షిండే నాయకత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన పథకాన్ని ఈరోజు నుంచి ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళల ఖాతాలో నెలకు రూ.1500 లను షిండే ప్రభుత్వం జమ చేయనుంది.

రాష్ట్రంలో ఈ పథకం ద్వారా అర్హత ఉన్న దాదాపు కోటి మంది లబ్దిదారులకు మేలు జరగనుంది. జూన్, జులై నెలతో కలిపి మొత్తం రూ.3,000 మహిళల ఖాతాలో జమ చేయనున్నారు. ఈ పథకం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.46,000 కోట్ల భారం పడనుంది. 21 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు వారి వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం లబ్దిదారుల కోసం ప్రత్యేకంగా శక్తి దూత్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications