ఛీ..ఛీ.. పోస్టుమార్టం గదిలో మందు విందు.. డాక్టర్ సస్పెన్షన్.. వీడియో వైరల్!

మహారాష్ట్రలోని పింప్రీ-చింఛ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యశ్వంతరావ్ చవాన్ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో కొందరు మద్యం చేసుకున్న ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలోని మార్చురీ గదిలో కొందరు మద్యం తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైభవ్ అవినాష్ మస్కేను మున్సిపల్ యంత్రాంగం తక్షణమే సస్పెండ్ చేసింది.

విషాదం.. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు!
విషాదం.. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు!

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఓ పౌరుడు తన బంధువు డెత్ సర్టిఫికేట్ కోసం రాత్రంతా ఆస్పత్రి బయట వేచి ఉన్నాడు. ఎంతసేపటికీ లోపల నుంచి స్పందన లేకపోవడంతో సదరు వ్యక్తి గది లోపలికి తొంగిచూడగా.. విధుల్లో ఉన్న వైద్యుడు తాగి ఉండటం గమనించాడు. అంతేకాకుండా అక్కడి బల్లపై మద్యం సీసాలు, తినుబండారాలు చెల్లాచెదురాగా పడి ఉన్న దృశ్యాలను ఆయన వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

Maharashtra Hospital Shocking Video Doctor Suspended for Party Inside Mortuary Went Viral Details Here

ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించిన పింప్రీ-చింఛ్వాడ్ మున్సిపల్ కమిషనర్ విజయ్ సూర్యవంశీ, అదనపు కమిషనర్ కుల్దీప్ జంగమ్ వెంటనే విచారణకు ఆదేశించారు. రోగుల భద్రత, వైద్య నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా బాధిత కుటుంబాల పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డాక్టర్ వైభవ్ మస్కేపై సస్పెన్షన్ వేటు వేశారు. మహారాష్ట్ర సివిల్ సర్వీసెస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై 15 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ నమోదు చేసి లోతైన విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు.

ట్రంప్ కు ఢిల్లీ నిరసనలసెగ..! పోలీసుల తీరును ప్రశ్నించాలని ఒత్తిళ్లు..!
ట్రంప్ కు ఢిల్లీ నిరసనలసెగ..! పోలీసుల తీరును ప్రశ్నించాలని ఒత్తిళ్లు..!

సస్పెన్షన్ కాలంలో డాక్టర్ వైభవ్ మున్సిపల్ ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని, అలాగే ఇతర వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేయకూడదని ఆంక్షలు విధించారు. అత్యంత పవిత్రంగా భావించే ఆస్పత్రి ప్రాంతంలో.. అదీ మరణించిన వారి బంధువులు విషాదంలో ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+