Lady Singham: అడవిలో అధికారి అరాచకం, గర్బవతితో గేమ్స్, లేడీ సింగం ఆత్మహత్య, కోరిక !
అమరావతి/ ముంబాయి: అటవీ మాఫియా గుండెల్లో నిద్రపోయి వారి ఆటకట్టించి అతి తక్కువ కాలంలోనే లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఎఫ్ఎస్ అధికారిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. లేడీ ఆఫీసర్ గర్బవతి అని తెలిసినా ఆమె సీనియర్ అధికారి అటవీ ప్రాంతాల్లోకి లాక్కెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె తట్టుకోలేకపోయింది. లైంగిక వేధింపులకు తోడు గర్భస్త్రావం కావడంతో ఆమె మనోవేధనతో సీనియర్ అధికారి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. సీనియర్ అధికారి లైంగిక వేధింపులు తట్టుకోలేని లేడీ సింగం ఆమె నివాసం ఉంటున్న క్వారట్స్ లో తనను ఏలా లైంగిక వేధింపులకు గురి చేసి టార్చర్ పెట్టారో అంటూ నాలుగు పేజీల డెత్ నోట్ రాసిపెట్టి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

లేడీ సింగం
మహారాష్ట్రలో భారత అటవీ సర్వీస్ (IFS) అధికారిణిగా పని చేస్తున్న దీపాలీ చవాన్ మొహీతే (28) ఫారెస్ట్ మాఫియా ఆగడాలను అడుగడుగా అడ్డుకుని వారి ఆటకట్టించింది. సిన్సియర్ అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న దీపాలీ చవాన్ అతి తక్కువ కాలంలోనే మహారాష్ట్ర లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకునింది. మహారాష్ట్రలో లేడీ సింగం అంటే టక్కున దీపాలీ పేరు చెబుతున్నారు.

అమరావతిలో లేడీ సింగం ఆత్మహత్య
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులోని హరిసాల్ గ్రామంలో లేడీ సింగం దీపాలీకి ప్రభుత్వం క్వాటర్స్ కేటాయించింది. దీపాలీ భర్త రాజేష్ మొహితే చిఖల్ ధారలో ట్రెజరీ అధికారిగా ఉద్యోగం చేస్తున్నారు. దీపాలీ తల్లి ఆమె సొంతఊరు అయిన సతారాకు వెళ్లిన తరువాత గురువారం రాత్రి నివాసం ఉంటున్న క్వాటర్స్ లో లేడీ సింగం దీపాలీ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

కోరిక తీర్చాలని శివకుమార్ టార్చర్
లేడీ సింగం దీపాలీ చవాన్ ఆత్మహత్య చేసుకునే ముందు నాలుగు పేజీల డెత్ నోట్ రాసిపెట్టడం కలకలం రేపింది. తన సీనియర్ అధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ (DCF) వినోద్ శివకుమార్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని దీపాలీ చవాన్ రాసిపెట్టారు. డీసీఎఫ్ శివకుమార్ పదేపదే తన కోరిక తీర్చాలని తనను చిత్రహింసలకు గురి చేశాడని దీపాలీ చవాన్ వివరించారు.

గర్భవతి అని చూడకుండా అడవిలో ?
దీపాలీ చవాన్ గర్భవతి అయ్యారు. తాను గర్భవతి అని తెలిసినా శివకుమార్ తనను విడిచిపెట్టలేదని, డ్యూటీ నెపంతో అటవీ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్లు తనను నడిపించాడని, దట్టమైన అటవీ ప్రాంతాంలోకి లాక్కెళ్లి రెండుసార్లు తనపై లైంగిక వేధింపులకు గురి చేశాడని దీపాలీ చవాన్ ఆమె డెత్ నోట్ లో వివరించింది.

చిత్రహింసలతో ఆత్మహత్య
దీపాలీ చవాన్ కు శివకుమార్ చిత్రహింసలకు గురి చేశాడని, పగలు, రాత్రి అని తేడా లేకుండా పెట్రోలింగ్ డ్యూటీ పేరుతో దీపాలీని అటవీ ప్రాంతాల్లోకి పిలుచుకుని వెళ్లి కిలోమీటర్ల దూరం నడిపించడంతో ఆమెకు గర్భస్త్రావం కావడంతో మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకుందని దీపాలీ స్నేహితురాలు ఒకరు అధికారులకు చెప్పారు.

శ్రీనివాసరెడ్డికి చెప్పినా డోంట్ కేర్
వినోద్ శివకుమార్ ఆగడాలతో విసిగిపోయి, అతను పెట్టే లైంగిక వేధింపులు తట్టుకోలేక దీపాలీ చవాన్ అనేక సార్లు ఆమె సీనియర్ అధికారి, ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారని, అయినా శివకుమార్ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలనే చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నానని దీపాలీ చవాన్ డెత్ నోట్ లో వివరించింది. దీపాలీ చవాన్ ఆత్మహత్యతో శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తప్పించామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీడియాకు చెప్పారు.

కామాంధుడు అరెస్టు
లేడీ సింగం దీపాలీ చవాన్ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నాగ్ పూర్ రైల్వేస్టేషన్ లో పారిపోవడానికి ప్రయత్నించిన అటవీ శాఖ అధికారి, కామాంధుడు వినోద్ శివకుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. శివకుమార్ ను సస్పెండ్ చేశామని సీనియర్ అధికారి అప్టే తెలిపారు. లేడీ సింగం దీపాలీ చవాన్ ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తామని, ఆమె ఆత్మహత్యకు కారణం అయిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీడియాకు చెప్పారు. ఓ సిన్సియర్ పోలీసు అధికారినిగా గుర్తింపు తెచ్చుకున్న లేడీ సింగం దీపాలీ చవాన్ ఆత్మహత్య చేసుకోవడంతో మహారాష్ట్రలో కలకలం రేపింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications