పెళ్లి చేసుకోమ్మని అడగడమే పాపమా.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి గోడలో పాతిపెట్టిన కసాయి...
వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి మెలసి ఉన్నారు. ఐదేళ్ల నుంచి సహాజీవనం కూడా చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరింది. దీంతో అతను ఎడమొహం పెడమొహం వేశాడు. ఆమె ఒత్తిడి తేవడంతో లాభం లేదని అనుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం యువతిని మట్టుబెట్టాడు. తర్వాత ఏమీ ఏరగనట్టు నటించాడు. కానీ తీగలాగితే డొంక కదిలింది. యువకుడు చేసిన దారుణం వెలుగుచూసింది.
మహారాష్ట్రలోని ఫల్గర్ జిల్లాకు చెందిన యువకుడు.. యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. అయితే పెళ్లి ప్రతిపాదన రాగానే.. అతనిలో మార్పు వచ్చింది. నమ్మించి మోసం చేశాడు. చివరికీ గతేడాది అక్టోబర్‌లో తాను ఉంటోన్న వానగావ్ గ్రామానికి తీసుకెళ్లాడు. వారిద్దరూ కలిసి 21వ తేదీ వరకు కలిసి ఉన్నారు. అతడిని యువతి పేరంట్స్ అడగగా గుజరాత్‌లోని వాపి వెళ్లిందని కబురు చెప్పాడు. ఎంతకీ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది వారు రంగంలోకి దిగారు.

యువకుడిని తమదైన శైలిలో ఆరా తీశారు. హత్య చేశానని అంగీకరించాడు. పెళ్లి చేసుకోవలని కోరడంతో.. హత్య చేశానని చెప్పాడు. తన ఇంటి గోడలో పాతిపెట్టానని చెప్పారు. అక్కడ వెలికితీయగా యువతి ఆస్తికలు బయటపడ్డాయి. హత్యానేరం అభియోగం మోపి అరెస్ట్ చేశారు. కానీ స్థానికంగా ఈ ఘటన మాత్రం కలకలం రేపింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications