చిరుతను వేటాడిన మంత్రి, సమర్థించుకొన్న మంత్రి
మహరాష్ట్ర మంత్రి గిరీష్ దత్తాత్రేయ మహజన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిస్టోల్‌తో ఓ చిరుతను ఆయన వేటాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ముంబై: మహరాష్ట్ర మంత్రి గిరీష్ దత్తాత్రేయ మహజన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిస్టోల్‌తో ఓ చిరుతను ఆయన వేటాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంత్రి తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
జలగావ్ జిల్లా ఛలీస్‌గావ్‌లో గత కొన్ని రోజులుగా ఓ చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళనలు రేపుతోంది. వరుసగా మనుషులు, పశువులను బలి తీసుకుండటంతో దానిని వేటాడేందుకు అటవీ శాఖ కూడా వేటగాళ్లకు అనుమతి ఇచ్చింది. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఎవరూ ఇంత వరకు దాని అంతు చూడలేకపోయారు

ఆ గ్రామం తన నియోజకవర్గం కిందకే రావటంతో స్వయానా మహాజనే రంగంలోకి దిగారు. సోమవారం అటుగా వెళ్తున్న ఆయన కాన్వాయ్ ఆపించి మరీ తన లైసెన్స్ రివాల్వర్‌తో చిరుతను వేటాడేందుకు యత్నించారు. అయితే అది వారికి చిక్కలేదు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రజా సంక్షేమం మాట పక్కనపెట్టి మంత్రి తుపాకీతో వేటాడడాన్ని కాంగ్రెస్ పార్టీనేతలు విమర్శిస్తున్నారు. అయితే మంత్రి మాత్రం తన పనిని సమర్థించుకుంటున్నారు.
కాగా, మహాజన్‌కు వివాదాలు కొత్తేం కాదు. మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు భారీగా పెరుగుతాయని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది ఈయనగారే. అంతేకాదు గతంలో ఓ వివాహ వేడకకు గన్‌తో దర్శనమిచ్చి సంచలనం సృష్టించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications