ఘోరం: కూతుళ్లను వ్యభిచారంలో దింపిన తల్లి
థానే: కన్న కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లే వారిని కాటేసింది. ఏ తల్లి చేయని దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
తమను వ్యభిచార కూపంలోకి నెట్టింది కన్న తల్లేనని ఆ బాలికలు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఆ దుర్మార్గురాలిని అరెస్ట్ చేశారు.

థానే పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మునీర్‌బాద్ ప్రాంతంలో తనిఖీలు చేస్తే, ఇద్దరు మైనర్ బాలికలు పట్టుబడ్డారు. వారిచ్చిన సమాచారంతో దాయ్‌గఢ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి, వ్యభిచార గృహం నడుపుతున్న ఆ బాలికల తల్లితో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు.
వారి నుంచి సెల్ ఫోన్లు రూ. 4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తల్లిపై మహిళల అక్రమ రవాణా సహా పలు కేసులు పెట్టామని వివరించారు. బాలికలను ఓ స్వచ్ఛంద సంస్థకు అప్పగించామని తెలిపారు.












Click it and Unblock the Notifications