ట్యూషన్ కు వెళ్లిన బాలికను రేప్ చేసిన 15 ఏళ్ల బాలుడు, కలికాలంలో వింత కేసులు !

ముంబై: బాలిక మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ బాలుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అయితే అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడికి 15 ఏళ్లు మాత్రమే ఉండటంతో పోలీసులు వివిద కోణాల్లో విచారణ చేస్తున్నారు. సోదరి దగ్గర ట్యూషన్ కు వచ్చిన బాలికను బాలుడు అత్యాచారం చేశాడని కేసు నమోదు అయ్యింది.

మహారాష్ట్రలోని థాణే జిల్లాలోని కల్యాణ్ టౌన్ షిప్ లో ఓ యువతి ట్యూషన్ నిర్వహిస్తున్నది. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బాలిక యువతి ఇంటికి ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటిలో ఎవరు లేరని సమాచారం.

Maharashtra, police taken 15 year old boy into custody for raping minor girl.

ట్యూషన్ చెప్పే యువతికి 15 ఏళ్ల తమ్ముడు ఉన్నాడు. ఆ సమయంలో ఇంటికి ఒంటరిగా వచ్చిన బాలిక మీద ఆ బాలుడు అత్యాచారం చేశాడని సమాచారం. ఇంటికి ఏడ్చుకుంటూ వెళ్లిన బాలికను ఆమె కుటుంబ సభ్యులు ఏం జరిగింది అని ఆరా తీశారు.

బాలిక శరీరం మీద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్యపరీక్షలకు తరలించి కేసు నమోదు చేశారు. 15 ఏళ్ల బాలుడి మీద పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచామని పోలీసులు అన్నారు. న్యాయస్థానం ఆదేశాలతో బాలుడిని రిమ్యాండ్ హోంకు తరలించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+