బీజేపీతో చర్చల్లేవ్.. శివసేన స్టెప్ బ్యాక్.. వేడెక్కుతున్న మహా రాజకీయం..!

ముంబై : బీజేపీతో చర్చల్లేవ్ అంటూ శివసేన దూకుడు పెంచింది. మహా ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అంటూ అధికారం చెరో సగం తీసుకోవాలని భావించిన శివసేనకు బీజేపీ సైడ్ ఇవ్వకపోవడంతో తామేమీ తక్కువగా కాదంటోంది. ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో 50-50 ఫార్ములాపై ఒప్పందం కుదిరిందనేది శివసేన నేతల వాదన. అయితే మంగళవారం నాడు అలాంటి ఆశలేవి పెట్టుకోవద్దన్నట్లుగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడిన తీరు శివసేన అగ్రనేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. బీజేపీ లీడరే అయిదేళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటారని ఆయన వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. మహారాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.

అప్పుడు విడివిడిగా.. ఇప్పుడేమో కలిసి

అప్పుడు విడివిడిగా.. ఇప్పుడేమో కలిసి

2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు పొత్తుల బేరం కుదరక రెండు పార్టీలు చెరో దారి ఎంచుకున్నాయి. అయితే ఈసారి మాత్రం పొత్తులతో ఒక్కటై ఎన్నికల బరిలోకి దిగాయి. ఆ క్రమంలో బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందగా.. శివసేన 56 సీట్లు కైవసం చేసుకుంది. అదలావుంటే ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు శివసేనకు జై కొట్టడంతో ఆ పార్టీ బలం 61కి చేరింది. ఈ క్రమంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అధికారంలో 50-50 ఫార్ములా అంటూ ప్రతిపాదన తీసుకొచ్చారు శివసేన నేతలు. ఇది ఇప్పటికిప్పుడు మాట్లాడుకున్న అంశం కాదని.. ఎన్నికలకు ముందర పొత్తులు పెట్టుకున్నప్పుడే బీజేపీ పెద్దలు సై అన్నారనేది శివసేన నేతల వాదన.

పొత్తు చిగురించిన నాటి నుంచే 50-50 ఫార్ములా

పొత్తు చిగురించిన నాటి నుంచే 50-50 ఫార్ములా

ఆ క్రమంలో బీజేపీతో పొత్తు చిగురించినప్పటి నుంచే అధికారం చెరో సగం అన్నట్లుగా వ్యవహరిస్తోంది శివసేన. ఇక ఫలితాలు వెలువడిన తర్వాత కూడా అదే విషయం పదేపదే ప్రస్తావిస్తోంది. బీజేపీ పెద్దలకు కూడా అదే చెబుతూ వస్తోంది. అంతేకాదు సీఎం కుర్చీ చెరో రెండున్నరేళ్లు అని మాట్లాడుతున్న శివసేన నేతలు కేబినెట్ ఏర్పాటులో కూడా తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ రెండు అంశాలు కూడా ఇరు పార్టీల నేతలను సందిగ్ధంలో పడేశాయి. ఈ నేపథ్యంలో మహా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.

చెరో సగం అధికారం.. బీజేపీ నో

చెరో సగం అధికారం.. బీజేపీ నో

2014 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించి బీజేపీ అధికారంలోకి రావడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. ఈసారి కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉండటంతో శివసేనతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తాను సీఎం కుర్చీ మరోసారి ఎక్కితే చాలా ఏళ్ల తర్వాత మహారాష్ట్ర చరిత్రలో ఆయనకు ఓ సరికొత్త పేజీ క్రియేట్ కానుంది. 50 ఏళ్ల మహారాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానంలో ఒకే పార్టీకి చెందిన వ్యక్తి రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఘనత ఫడ్నవీస్‌కు దక్కనుంది. ఈ నేపథ్యంలో శివసేన 50-50 ఫార్ములాకు సానుకూలంగా వ్యవహరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకేనేమో శివసేన ప్రతిపాదనను బీజేపీ పెద్దలు అంగీకరించలేదని కుండ బద్దలు కొట్టారు.

బీజేపీతో చర్చల్లేవ్ అంటున్న శివసేన

బీజేపీతో చర్చల్లేవ్ అంటున్న శివసేన

ఫడ్నవీస్ వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన కూడా దూకుడు పెంచింది. బీజేపీతో ఇక చర్చల్లేవ్ అంటూ ప్రకటించారు ఆ పార్టీ సీనియర్లు. ఈ క్రమంలో బీజేపీ - శివసేన మధ్య 50-50 ఫార్ములా దూరం పెంచనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఫలితాలు వెలువడిన నాటి నుంచి అధికార పీఠం చెరో సగం అంటూ చెప్పుకొస్తున్న శివసేన నేతలు.. ఫడ్నవీస్ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురయ్యారు. అసలు బీజేపీతో ఇక చర్చలు ఉండవు అంటూ తేల్చి పారేశారు. ఈ నేపథ్యంలో మహా రాజకీయ పరిణామాలు మరింత హాట్‌గా మారే ఛాన్స్ కనిపిస్తోంది.

 శివసేనతో జతకట్టే ప్రసక్తి లేదంటున్న ఎన్సీపీ

శివసేనతో జతకట్టే ప్రసక్తి లేదంటున్న ఎన్సీపీ

అధికార పీఠంలో శివసేనకు సగ భాగం ఇచ్చేందుకు బీజేపీ నేతలు సుముఖంగా లేరనే విషయం స్పష్టమైంది. ఫడ్నవీస్ వ్యాఖ్యలతో నో ఛాన్స్ అనే విషయం సూటిగా చెప్పినట్లైంది. అటు శివసేన కూడా మీతో మాకేంటి అన్నట్లుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. అంతేకాదు అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సుందనే సంకేతాలు పంపిస్తోంది. అదలావుంటే ఎన్సీపీ మాత్రం శివసేనతో జతకట్టే ప్రసక్తి లేదని తేల్చేసింది. మొత్తానికి మహా రాజకీయాల్లో మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+