Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గెలిస్తే ఈవీఎంలు మంచివి..ఓడితే ఫిర్యాదులా:బయటపడ్డ విపక్షాల డ్రామాలు..!!

గత నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం అసలైన ప్రజాతీర్పు కాదని ఈవీఎంలను ట్యాంపర్ చేసి మోసంతో కూటమి గెలిచిందని విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జార్ఖండ్‌లో కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడ జేఎంఎం-కాంగ్రెస్ కూటమి గెలిచింది. అలాంటప్పుడు అక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారని భావించాలా అని సామాన్య ఓటరు ప్రశ్నిస్తున్నారు. గెలిస్తే విజయం తమ ఖాతాలో ఓడితే నింద ఈవీఎంలపై వేయడం విపక్షాలకు పరిపాటిగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ఇక మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మర్కద్వాడి గ్రామంలో స్థానికులు నిబంధనలకు విరుద్ధంగా బ్యాలట్ పేపర్లతో తిరిగి పోలింగ్ నిర్వహించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు.

మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గంలో శరద్ పవార్ వర్గం ఎన్సీపీ నేత ఉత్తమ్ రావ్ జాన్కర్ బీజేపీ అభ్యర్థి రామ్ సత్ఫుతే పై 13వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే మర్కద్వాడి గ్రామంలో బీజేపీ అభ్యర్థి రామ్ సత్పుతేకు మెజార్టీ వచ్చింది. దీంతో రావ్ జాన్కర్ మద్దతుదారులు రీపోలింగ్ నిర్వహించాలని నిబంధనలకు విరుద్ధంగా పిలుపునిచ్చారు.ఇక రీపోలింగ్ నిర్వహించాలని పట్టుబట్టడంతో స్థానిక ఎన్నికల అధికారి అది అక్రమం అని ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ అనుమతించలేదు.

Maharashtra Polls Expose Opposition s EVM Narrative Contradictions

ఈవీఎంలు తీసుకొచ్చింది కాంగ్రెస్సే:

అసలు ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించాలన్న ఆలోచన తీసుకొచ్చి అమలు చేసిందే కాంగ్రెస్. ఒకప్పుడు కాంగ్రెస్‌కు వరంలా కనిపించిన ఈవీఎంలు నేడు శాపంగా మారాయి.లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్ అగాఢీ అత్యధిక స్థానాలు గెలిచినప్పుడు కూడా ఇదే ఈవీఎంలనే వినియోగించారన్న సంగతి కాంగ్రెస్ మరువకూడదని గ్రామస్తుడు జయేష్ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని వీరు అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే ఈవీఎంలు వచ్చాయన్న సంగతి గుర్తెరగాలని అన్నారు.

మరకద్వాడీ గ్రామంలో ఓటరుకు బాగా తెలుసు

మరకద్వాడీలో గ్రౌండ్ రిపోర్ట్ పూర్తిగా భిన్నంగా ఉంది. బీజేపీ నేత రామ్ సత్పుతే ఈ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయినప్పటికీ మరకద్వాడీ గ్రామం విషయానికొస్తే ఇక్కడ గెలిచారు. ఆయన గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనకు మెజార్టీ తెచ్చిపెట్టాయని కౌశల్ అనే స్థానిక గ్రామస్తుడు చెప్పారు. అంతేకాదు ఇక్కడ మెజార్టీ ఎందుకు వచ్చిందనే దానిపై కూడా వివరణ ఇచ్చారు. ఇక్కడ పర్యాటక కేంద్రం ఏర్పాటు కావడం వెనుక రామ్ సత్పుతే కృషి చాలా ఉందని అంతేకాకుండా నిధులు కూడా తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇక్కడ తన మార్కు అభివృద్ధి చూపడంతో 150 ఓట్ల మెజార్టీ వచ్చిందని చెప్పారు.

Maharashtra Polls Expose Opposition s EVM Narrative Contradictions

ఇక మహిళా సాధికారత పథకం లడ్కీ బెహెన్ యోజన ఓటర్లలో విశ్వాసం నింపి ఇక్కడ సెంటిమెంట్‌ను కాలరాసిందని చెప్తున్నారు. ఒక వేల బ్యాలట్ పేపర్లతో కూడిన ఓటింగ్‌కు వెళ్లినా పొరపాట్లు జరుగుతాయి అయితే లడకీ బెహెన్ యోజన పథకం ఓటరును చాలా ప్రభావితం చేసిందని అన్నారు ఓంకార్ అనే గ్రామస్తుడు.

అవకాశ రాజకీయాలు వర్సెస్ వాస్తవాలు

ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ విపక్షాలు చేస్తున్న వాదన అవకాశ రాజకీయంగా కనిపిస్తోంది. నిజంగానే ఈవీఎంలతో సమస్య ఉంటే లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎందుకు మాట్లాడలేదని మరో గ్రామస్తుడు మిథున్ ప్రశ్నించారు.వీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనవని అన్నారు. బీజేపీ దృష్టంతా అభివృద్ధిపైనే ఉండటంతో ఇలాంటి తీర్పును ఓటర్లు ఇచ్చారని అన్నారు. ఇక దేవేంద్ర ఫడణవీస్,షిండే,అజిత్ పవార్ త్రయం అవినీతి లేని పాలన అందించడమే కాకుండా మహిళల కోసం మంచి పథకాలు తీసుకొచ్చారని అదేశ్ గుప్తా అనే వ్యక్తి చెప్పారు. సత్పుతే చేసిన అభివృద్ధి ఏంటో ఓటరుకు తెలుసని అందుకే ఈ గ్రామంలో మెజార్టీ ఇచ్చారన్నారు.

Maharashtra Polls Expose Opposition s EVM Narrative Contradictions

ట్యాంపరింగ్ కాదు ట్రాన్స్‌పెరెన్సీ

ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ట్యాంపరింగ్ వట్టి ఆరోపణలే అనే విషయం స్పష్టం అవుతుంది. నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్లయితే లోక్‌సభ ఎన్నికలప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు అలోక్ అనే గ్రామస్తుడు. అంటే వారు గెలిస్తే ఈవీఎంలతో సమస్యలేదు.. అదే ఓడితే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.వారి ఆరోపణలు నిర్మాణాత్మకంగా లేవని అన్నారు. ఏదో కుట్రపూరితంగా కనిపిస్తోందని చెప్పారు.

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే

రీపోలింగ్ నిర్వహించాలన్నది వాస్తవానికి గ్రామస్తుల ఆలోచనకాదు. రాజకీయ నాయకులు ప్రేరేపించారు. వారిస్వార్థం కోసం ప్రజలను వాడుకున్నారనేది స్పష్టమవుతోంది. స్వల్పకాలిక లాభం కోసం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేయడం ఇకనైనా మానుకోవాలి. మరకద్వాడి గ్రామస్తులు అభివృద్ధికి ఓటేశామని, రాజకీయాలు చూడలేదని స్పష్టంగా చెబుతున్నారు. ఈవీఎంలు నిజంగానే ట్యాంపరింగ్ అయి ఉంటే మా ఎంపీ అభ్యర్థి ఇక్కడ గెలిచి ఉండేవారని దినేష్ అనే వ్యక్తి చెప్పారు.కానీ తామెప్పుడూ ఈవీఎంలపై ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశారు. తమకు ప్రజాతీర్పు అంటే గౌరవం ఉందన్నారు.విపక్షాలు కూడా ప్రజాతీర్పును గౌరవించాలని సూచించారు.

చివరిగా ఎప్పుడైతే అన్ని పార్టీలు పరిపాలనపై దృష్టి సారించి తప్పుడు ఫిర్యాదులు చేయడం మానుతారో అప్పుడే ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లు తమ నిర్ణయం ఏంటో సూటిగా చెప్పేస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+