వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా కల్లోలం: ఒకే రోజు 568 మంది మృతి, 67వేలకుపైగా కేసులు

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు మరింతగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 568 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఇవే అత్యధికంగా కావడం గమనార్హం.

అంతేగాక, ఒక్క రోజు వ్యవధిలో 67,468 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. మహారాష్ట్రలోని ముఖ్య నగరాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో పుణెలో కొత్తగా 10,852 కరోనా కేసులు, 35 మంది మరణించారు.

Maharashtra Records 568 Covid Deaths In 24 Hours, Highest So Far

ముంబై నగరంలో 7684 కరోనా కేసులు నమోదు కాగా, 62 మంది మరణించారు. నాగ్‌పూర్‌లో 7555 కేసులు నమోదు కాగా, 41 మంది మరణించారు. నాసిక్‌లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకైన ప్రమాదంలో 24 మంది రోగులు మృతి చెందారు. ఈ నగరంలో 6703 కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు.

Recommended Video

COVID-19 : Uddhav Thackeray Urges Centre To Consider COVID-19 As Natural Calamity || Oneindia Telugu

గత 24 గంటల్లో రాష్ట్రంలో 54,985 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 32,68,449కు చేరింది. రివరీ రేటు 81.15 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 2,46,14,480 కరోనా నమూనాలను పరీక్షించగా.. 40,27,827 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,15,292 మంది హోం క్వారంటైన్లో ఉండగా, 28,384 ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు.

English summary
Maharashtra today reported 568 deaths because of the coronavirus, registering its highest ever single-day spike in death count. It also logged 67,468 new cases in 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X