బిస్కట్లు కొనుక్కోని వెళ్తున్న బాలికపై అత్యాచారం

బాధితురాలు భివాండి ప్రాంతంలోని జైతున్‌పురలో నివాసం ఉంటుంది. క్వాటర్ గేట్ మసీదుకు ఎలా వెళ్లాలో దారి చూపించాలని అడిగి, ఆ బాలికను ఓ గౌడౌన్ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.
తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అత్యాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 376, 363, 506 క్రింద నిందుతుడిపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామన్నారు.












Click it and Unblock the Notifications