లైంగికంగా వేధిస్తున్నారు: సీనియర్ ఐపిఎస్ అధికారిపై మహిళ ఫిర్యాదు
ముంబై: తనను ఓ సీనియర్ ఐపిఎస్ అధికారి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి(32) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారి కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న తనను కొంత కాలంగా లైంగిక వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొలాబా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. సదరు ఐపిఎస్ అధికారి ఆయన కార్యాలయంలో సోమవారం తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, తనను తాకారని మహిళా ఉద్యోగి ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం తన వివాహం, కుటుంబసభ్యుల గురించి అడిగారని వెల్లడించారు.

తన మొబైల్‌కు తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నారని వితంతువు అయిన ఆ మహిళ తెలిపారు. ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, బాధితురాలి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు.
సదరు ఐపిఎస్ అధికారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులు లేరని, అయినా నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామని ఓ పోలీసు అధికారి మంగళవారం చెప్పారు.












Click it and Unblock the Notifications