Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివాదంలో మహిష దసరా ఉత్సవాలు, బీజేపీ వార్నింగ్, మైసూరు 'సిటీ లో టెన్షన్ టెన్షన్ !

బెంగళూరు/మైసూరు: రోజుకో వివాదంతోవార్తల్లో ఉన్న మహిష ఉత్సవాన్ని (celebrations) నిర్వహించడానికి అవకాశం లేదని మైసూరు (Mysruru) సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. ఈనెల13వ తేదీన మహిష దసరా (Dussehra) ఉత్సవాలు నిర్వహించడానికి కొంత మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో మహిష దసరాను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ఛలో చామండికొండ ర్యాలీకి పిలుపునిచ్చారు. మహిష దసరాకు (Dussehra), బీజేపీ నాయకుల ర్యాలీకి అనుమతి లేదని మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు.

దసరా (Dussehra)నేపథ్యంలో సాంస్కృతిక నగరమైన మైసూర్ నగరం ముస్తాబైంది. రోడ్ల మీద గుంతలను మూసేస్తున్నారు. ప్యాలెస్ భవనంలో బల్బులు మారుస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు. కానీ మధ్యమధ్యలో మహిష దసరా సందడి ఎక్కువైంది. గత రెండు వారాలుగా మైసూరు నగరంలో మహిష దసరా (Dussehra) ఉత్సవాలపై (celebrations) అనుకూల వ్యతిరేక చర్చ మొదలైంది. బీజేపీ (BJP) ఎంపీ ప్రతాపసింహ, మైసూరు మేయర్ శివకుమార్, ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్‌లతో పాటు బీజేపీ కార్యకర్తలు మహిష ఉత్సవాన్ని వ్యతిరేకించారు.

Mahisha Dussehra celebrations, the reason for the controversy, were the BJP leaders who gave the warning.

మహిష దసరా (Dussehra)జరుపుకోనివ్వబోం అని బీజేపీ (BJP) ఎంపీ ప్రతాప్ సింహ తేల్చి చెప్పారు. మహిష దసరాను వ్యతిరేకిస్తూ 14వ తేదీన చలో చాముండిబెట్ట నిర్వహించాలని నిర్ణయించామని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ ప్రకటించారు. మహిష దసరా (Dussehra)ఉత్సవ కమిటీ నిర్వహకులు మాట్లాడుతూ ఇది మా పూర్వీకుల పండుగ, మహిష విగ్రహానికి పూజలు చేస్తాం, మహిషా ఉత్సవాలకు (celebrations) అనుమతి ఇవ్వాలని మనవి చేస్తున్నారు.

మహిష దసరా వేడుకకు అనుమతిస్తారా లేదా ?అని మైసూరు (Mysuru) ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహిష దసరాకు అనుమతించకపోతే జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. మహిష దసరా నిర్వహిస్తే దసరా ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిరసన తెలుపుతామని బీజేపీ (BJP) ఎంపీ ప్రతాప్ సింహ హెచ్చరించారు. మహిష దసరా (Dussehra)వేడుకలను వ్యతిరేకిస్తూ స్నేహమహి కృష్ణ మైసూర్ 8వ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మహిష దసరా (Dussehra) అమలు కమిటీ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసి పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. మహిష దసరా ఉత్సవాలకు (celebrations) వివిధ సంఘాలు మద్దతు తెలపగా, మైసూరు (Mysuru) నగరంలోని కొన్ని వార్డుల్లో బీజేపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించి మహిష దసరా ఉత్సవాలను (celebrations) బహిష్కరించాలని, మహిష దసరాను (Dussehra)వ్యతిరేకించాలని పిలపునిచ్చారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు ఛలోచాముండి బెట్ట కార్యక్రమానికి తరలిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Mahisha Dussehra celebrations, the reason for the controversy, were the BJP leaders who gave the warning.

2015 నుంచి దళిత అనుకూల సంస్థలు, అభ్యుదయవాదులు మైసూర్‌లో మహిష దసరా (Dussehra)జరుపుకుంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిష దసరాకు అవకాశం రాలేదు. ఇప్పుడు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వచ్చాక మహిష దసరా వేడుకలు మళ్లీ తెరపైకి వచ్చాయి. మహిష దసరా (Dussehra) వేడుకలపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ తదితరులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మహిష దసరా జరగనివ్వబోమని బీజేపీ (BJP) ఎంపీ ప్రతాప్ సింహ సవాల్ విసిరారు.

మహిషా సమితి దసరా (Dussehra)లేదా చాముండేశ్వరిని వ్యతిరేకించడం లేదు. మహిష విగ్రహానికి మాత్రమే పూలమాల వేస్తామని స్పష్టం చేశారు. మహిష దసరా సెలబ్రేషన్ (celebrations) కమిటీ మరియు మైసూర్ యూనివర్సిటీ పరిశోధకుల సంఘం 13వ తేదీన మహిష దసరా జరుపుకోవాలని నిర్ణయించాయి. చాముండి కొండను మహిష కొండగా నమోదు చేసిన ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేశారు. అలా ఈసారి మహిష దసరా (Dussehra) వివాదానికి కారణం అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+