Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెక్స్ వర్కర్ వ్యాఖ్య: టీవీ యాంకర్‌ని తిడ్తూ 2వేల కాల్స్

తిరువనంతపురం: మహిషాసుర జయంతిని జరపవచ్చా? లేదా? అనే అంశం పైన టీవీలో చర్చ పెట్టినందుకు గాను ఓ మహిళా టీవీ యాంకర్‌కు 2,000కు పైగా బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఈ షాకింగ్ సంఘటన కేరళలో చోటు చేసుకుంది.

ఏసియా నెట్ చీఫ్ కో ఆర్డినేటింగ్ ఎడిటర్, యాంకర్ సింధు సూర్య కుమార్ ఫిబ్రవరి 26వ తేదీన మహిషాసుర జయంతిని జరుపుకోవడాన్ని దేశద్రోహంగా పరిగణించాలా? వద్దా? అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించింది.

అప్పటి నుంచి ఆమెకు తెగ తిట్టిపోస్తూ లెక్కలేనన్ని ఫోన్ కాల్సు వస్తున్నాయి. షో సమయంలో హిందూ దేవత ఒకరిని సెక్స్ వర్కర్‌గా అభివర్ణించారని సింధు పైన ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె పైన పేస్‌బుక్ పేజీలో తిడుతూ పోస్టులు పెట్టారు.

టీవీ యాంకర్

టీవీ యాంకర్


అందులో ఒకరు ఏకంగా సింధు మొబైల్ నెంబర్‌ను పోస్ట్ చేశారు. ఆమెకు నేరుగా ఫోన్ చేసి తిట్టాలని అందులో పేర్కొన్నారు.

టీవీ యాంకర్

టీవీ యాంకర్

అప్పటి నుంచి ఆమెకు లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెక ఫోన్లు చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

 టీవీ యాంకర్

టీవీ యాంకర్

అరెస్టయిన వాళ్లంతా భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, శ్రీరామ సేన లాంటి సంస్థలకు చెందినవారని పోలీసులు చెప్పారు.

టీవీ యాంకర్

టీవీ యాంకర్

అయితే, దేవతను తిడుతూ చేసిన వ్యాఖ్యలు బిజెపి నేత వివి రాజేష్ ఓ కరపత్రంలో చదివారని, దానిని దేశద్రోహం ఎలా అంటారని మాత్రమే అడిగానని సింధు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

టీవీ యాంకర్

టీవీ యాంకర్


హిందూ దేవతను సెక్స్ వర్కర్‌గా చెప్పడంలో తప్పేంటని తాను అనలేదని సదరు యాంకర్ సింధు సూర్య కుమార్ ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+