కోల్‌కతాలో ఘోర ప్రమాదం: రైల్వే పట్టాలపై కూలిన బ్రిడ్జి, శిథిలాల కింద వాహనాలు
Recommended Video

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన ఓ వంతెన కుప్పకూలింది. వంతెన కింద బస్సులు, కార్లు ఉన్నాయి. ఈ సంఘటన అలీపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బ్రిడ్జి కూలగానే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
వంతెన పై నుంచి చాలా వాహనాలు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కింద ఉన్న రైల్వే పట్టాలపై కూలింది. దీంతో వాహనాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. కూలిన బ్రిడ్జి.. దక్షిణ కోల్‌కతాలోని మజెర్‌హట్ బ్రిడ్జి. దీని కింద పలు, ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనాలు చిక్కుపోయాయి.
డైమండ్ హార్బర్ రోడ్డులోని ఈ బ్రిడ్జి మంగళవారం సాయంత్రం గం.4.45 నిమిషాలకు కూలింది. వెంటనే స్థానికులు స్పందించారు. అయిదు గంటలకు సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే పలువురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
శిథిలాల కింద బస్సు, బైకులు, కార్లు
ప్రమాదం సమయంలో పలువురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పోలీసులు, ఆర్మీ వెంటనే రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదం జరగడంతో శిథిలాల కింద ఓ మినీ బస్సు, ఐదు కార్లు, పలు బైకులు చిక్కుకున్నాయని తెలుస్తోంది.
ప్రమాదంపై మమతా బెనర్జీ
ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆందోళన చెందుతున్నామని చెప్పారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టామన్నారు. తమ తొలి ప్రాధాన్యత బ్రిడ్జి కింద చిక్కుకుపోయిన వారిని కాపాడటం అన్నారు. విచారణ అంశం సహాయక చర్యల తర్వాత ఉంటుందన్నారు. పోలీసులు బ్రిడ్జి ప్రమాదంపై విచారణ జరుపుతున్నారని మమత చెప్పారు. అయితే తమ ప్రాధాన్యత అందరినీ కాపాడటం అన్నారు.
40 ఏళ్ల కిందటి బ్రిడ్జి
ప్రమాదంలో చిక్కుపోయిన వారిని కాపాడుతున్నామని పశ్చిమ బెంగాల్ మంత్రి ఫర్హద్ హకీమ్ వెల్లడించారు. ఈ బ్రిడ్జి 40 ఏళ్ల కిందటిది అని చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆరుగురిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు.
ఇటీవల వర్షాలు, అందువల్ల కూడా
కోల్‌కతాలోని అతి పురాతన బ్రిడ్జిల్లో ఇది ఒకటి. ఇటీవల ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగానే బ్రిడ్జి కూలిపోయిందని పోలీసులు భావిస్తున్నారు.
More visuals from the spot where part of Majerhat bridge in South Kolkata has collapsed. #WestBengal pic.twitter.com/Jg75o9qFzI
— ANI (@ANI) September 4, 2018
#WATCH: Rescue teams and ambulances arrive at the spot where part of Majerhat bridge in South Kolkata has collapsed. #WestBengal pic.twitter.com/5pgpxSgwke
— ANI (@ANI) September 4, 2018
#SpotVisuals: Majerhat bridge in South Kolkata has collapsed. More details awaited. #WestBengal pic.twitter.com/FsZGeImE4o
— ANI (@ANI) September 4, 2018
We are very worried. We are receiving information from the rescue team on ground(majerhat bridge collapse in Kolkata). We want to go back as soon as possible. There are no flights in the evening, we are unable to do so: West Bengal CM Mamata Banerjee in Darjeeling (file pic) pic.twitter.com/DJfU1QDEm2
— ANI (@ANI) September 4, 2018
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications