మావోయిస్టులకు భారీ షాక్.. ఈసారి 16 మంది

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుకుమా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కాగా, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు.

సుకుమా జిల్లాలోని గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. శనివారం ఉదయం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఈ క్రమంలో కెర్లపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మంది మావోయిస్టులను హతమార్చారు.

Major encounter in Chhattisgarh 16 Maoists killed

డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌గార్డ్‌ (DRG), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్​ రాజ్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఎదురుకాల్పులు జరిగిన స్థలం నుంచి 16 మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ సుందర్​రాజ్‌ తెలిపారు. ఘటనాస్థలంలో ఏకే-47 రైఫిల్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, పాయింట్ 303 రైఫిల్, రాకెట్ లాంచర్, బారెల్ గ్రెనేడ్ లాంచర్, పేలుడు పదార్థాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు.

సుకుమా జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 16 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆయుధాలు మార్పును తీసుకురాలేవని, కేవలం శాంతి, అభివృద్ధితోనే మార్పు సాధ్యమని కేంద్రమంత్రి హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని నిశ్చయించుకున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కాగా, గత మూడు నెలల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 130 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+