ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ నేరవేరుతున్న వేళ.. ఆ స్కీం అమలుకు డేట్ ఫిక్స్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కోసం వైద్య సేవల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల కోసం ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద క్యాష్ లెస్ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం రేట్లను వర్తింప చేయడానికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జూలై 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్ అమల్లోకి

ఉద్యోగులను సంతోషానికి గురిచేసిన ఈ సరికొత్త విధానం త్వరలోనే రాష్ట్రంలో అమలులోకి రానుంది. జూలై 15వ తేదీన ఉద్యోగుల కోసం తీసుకువచ్చిన ఈ హెచ్ ఎస్ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఈ నూతన విధానంలో కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఈ హెచ్ ఎస్ కింద ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీ ధరలు ఉంటాయి.

employees health scheme telangana govt said good news that ehs will implement from july 15th

నెట్వర్క్ ఆసుపత్రులలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్సలు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హెల్త్ స్కీమ్ బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం కారణంగా ఉద్యోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందుతుంది. జూలై 15వ తేదీ నుంచి ఈ హెచ్ ఎస్ కార్డులు కలిగిన ప్రతి ఉద్యోగి, పెన్షనర్ నెట్వర్క్ ఆసుపత్రులలో రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్సలు పొందే వీలుంటుంది. ఈ పథకానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించడం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ ల కుటుంబాలకు లబ్ది

కార్పొరేట్ మరియు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలను విడతలవారీగా క్లియర్ చేస్తుంది. చాలాకాలంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే రేట్లను ఈ హెచ్ ఎస్ కింద అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత లభించనుంది.

డెడ్ స్టోరేజ్ కి నాగార్జున సాగర్ నీటిమట్టం.. ఏపీ, తెలంగాణాలకు డేంజర్ బెల్స్!
డెడ్ స్టోరేజ్ కి నాగార్జున సాగర్ నీటిమట్టం.. ఏపీ, తెలంగాణాలకు డేంజర్ బెల్స్!

ఇకపై వారికి నో టెన్షన్.. ప్రభుత్వానికి మరో కొత్త డిమాండ్

ఈ నిర్ణయం కారణంగా ప్రైవేటు మరియు కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ హెచ్ ఎస్ కార్డుదారులకు బెడ్ ల నిరాకరణ, చికిత్సల నిలిపివేత వంటి సమస్యలు ఉండవు. అయితే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కి ఇచ్చే బెనిఫిట్స్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ లో కూడా ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ముందు విజ్ఞాపనలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+