టీ20ల్లో అట్టర్ ఫ్లాప్ అయినా ఆ ఇద్దరికీ గోల్డెన్ ఛాన్స్: ఇంగ్లాండ్ పై ఆడే వన్డే జట్టులో చోటు

ఇంగ్లాండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయాల బారిన పడిన ఇద్దరు కీలక ఆటగాళ్ల స్థానాన్ని భర్తీ చేశారు సెలెక్టర్లు. ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను తీసుకున్నారు. ప్రస్తుతం టీ20 టీమ్ లో ఆడుతున్న ఈ ఇద్దరు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయపడ్డ బౌలర్ల స్థానంలో వీరిద్దరూ ఎంపికయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

భారత జట్టు వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో యువ పేసర్ హర్షిత్ రాణా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్స్‌లో వారిద్దరూ గాయపడ్డారు. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు. వారి స్థానాల్లో సరైన ప్రత్యామ్నాయాలను వెతికేందుకు సెలెక్టర్లు ఎక్కువ సమయం తీసుకోలేదు. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను తీసుకున్నారు. ఇంగ్లాండ్ పై జరిగిన టీ20ల్లో పెద్దగా రాణించకపోయిన వారిపైనే నమ్మకం ఉంచారు.

Prince Yadav and Ravi Bishnoi Replace Harsit Rana Varun Chakaravarthy in Team India vs Englad ODIs

వన్డేల్లో ఆడటం ప్రిన్స్ యాదవ్ కు ఇదే మొదటిసారి. ఈ రైల్వేస్ యువ ఆటగాడికి ఇది కెరీర్ మార్చే అద్భుతమైన అవకాశం. రంజీ, విజయ్ హజారే ట్రోఫీలలో అతను రాణించాడు. ఒత్తిడి సమయాల్లో అటు లోయర్ ఆర్డర్‌లో బ్యాట్ ఝులిపించడంతో పాటు ఇటు మీడియం పేస్ బౌలింగ్‌తో వికెట్లు తీయగల సామర్థ్యం ప్రిన్స్‌కు ఉంది. హర్షిత్ రాణా దూరం కావడంతో వచ్చిన ఈ అవకాశాన్ని అతను వదులుకోకూడదని భావిస్తున్నాడు.

మరోవైపు, టీమిండియా తరఫున ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన విజయాల్లో భాగస్వామి అయిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కి ఇది పునరాగమన అవకాశం. వరుణ్ చక్రవర్తి స్థానాన్ని భర్తీ చేయడానికి బిష్ణోయ్‌ సరైన ఎంపిక అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిష్ణోయ్ తన గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెట్టడంలో దిట్ట. పవర్‌ప్లేలోనూ, మధ్య ఓవర్లలోనూ పరుగులు నియంత్రిస్తూనే వికెట్లు పడగొట్టే నైపుణ్యం అతనికి అదనపు బలాన్ని ఇస్తుంది.

ఇంగ్లాండ్ లాంటి దూకుడుగా ఆడే బలమైన జట్లతో తలపడేటప్పుడు జట్టు వైవిధ్యం చాలా ముఖ్యం. రాబోయే ఐసీసీ టోర్నమెంట్‌లను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు యాజమాన్యం తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు దూరం కావడం కొంత నిరుత్సాహం కలిగించినా, కొత్తగా వచ్చిన ఆటగాళ్ల ద్వారా విభిన్నమైన వ్యూహాలను అమలు చేసే దిశగా టీమిండియా మేనేజ్‌మెంట్ అడుగులు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+