Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాపింగ్‌మాల్‌లో ఎగసిపడుతున్న మంటలు.. రంగంలోకి 10 ఫైరింజన్లు

నోయిడా : యూపీలోని నోయిడాలోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 25ఏ లో గల స్పైస్ మాల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 10 ఫైరింజన్లు ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమి జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టం భారీ స్థాయిలో జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నోయిడాలోని స్పైస్ వరల్డ్ మాల్‌ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మాల్‌లో షాపింగ్ కోసం పలు షాపులు, ఫుడ్ కోర్టులు, మూవీ థియేటర్లు ఉన్నాయి. షాపింగ్‌కు వచ్చిన వారు తమకు ఇష్టమొచ్చిన ఆహారాన్ని అరగించి .. సినిమా చూసి జాలీగా బయటకెళ్తారు. అయితే ఇవాళ స్పైస్ షాపింగ్ మాల్ రెండో అంతస్తులు మంటలు ఎగిసిపడ్డాయి.

Major fire breaks out at noida Spice mall

దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 10 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మాల్‌లో చిక్కుకున్న వారిని సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసినట్టు ప్రాథమిక సమాచారం అందుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+