కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన -సీడబ్ల్యూసీ సహా కీలక కమిటీల్లో మార్పులు-సోనియా కోసం స్పెషల్ టీమ్

జాతీయ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)'తోపాటు కేంద్ర ఎన్నికల కమిటీల్లో మార్పు చేర్పులు జరిగాయి. గులాం నబీ ఆజాద్ సహా పలువురు కీలక నేతలను జనరల్ సెక్రటరీ పదవుల నుంచి తప్పించారు. అయితే, సరికొత్తగా అధినేత్రికి సలహాలు ఇచ్చేందుకు ఆరుగురు సభ్యుల కమిటీని కూడా ప్రకటించారు. సోనియా ఆదేశాల మేరకు చోటుచేసుకున్న మార్పుల వివరాలను ఏఐసీసీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఆ వివరాలివి..

Recommended Video

    #Congress : Sonia Gandhi కీలక ఆదేశాలు.. పార్టీ లో భారీ మార్పులు! || Oneindia Telugu

    ఇన్నాళ్లూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న పి.చిదంబరం, జితేంద్ర సింగ్, తారీఖ్ అన్వర్, రణదీప్ సుర్జేవాలాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెగ్యులర్ సభ్యులుగా నియమించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు కోల్పోయినప్పటికీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనిలు సీడబ్ల్యూసీ సభ్యులుగా కొనసాగనున్నారు. ఇక..

    major organisational reshuffle in congress; six-member panel to assist Sonia

    కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి(సీఈఏ) కొత్త చైర్మన్ గా మధుసూదన్ మిస్త్రీని నియమించారు. సీఈఏలో సభ్యులుగా రాజేశ్ మిశ్రా, కృష్ణ బైరె గౌడ, జ్యోతిమణి, అర్విందర్ సింగ్ లౌలీ ఉంటారని ఏఐసీసీ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అధినేత్రికి సలహాలు సూచనలు అందించేందుకు కొత్తగా మరో కమిటీని కూడా ప్రకటించారు.

    తాత్కాలిక చీఫ్ సోనియాకు సలహాలు కోసం ఏర్పాటైన కొత్త కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించారు. సీనియర్ నేత ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జేవాలా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని పార్టీ తెలిపింది. ఆగస్టు 24న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలకు అనుగుణంగానే సంస్థాగత ప్రక్షాళలకు సోనియా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+