దౌర్జన్యం: బస్ స్టాండ్లలో జయలలిత ఫోటోలు, నేమ్ ప్లేట్స్ తొలగింపు
చెన్నైలోని సీఎంబీటీ బస్ స్టాండ్ లో గోడల మీద ఉన్న జయలలిత ఫోటోలు, బ్యానర్లు, ఫెక్సీలు, నేమ్ ప్లేట్లను మక్కల్ అథిగారమ్ మూవ్ మెంట్స్ అనే సంస్థ కార్యకర్తలు తొలగించి నిరసన వ్యక్తం చేసి సుప్రీం కోర్టు దోషి అ
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ భవనాలు, సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నేమ్ ప్లేట్లు, ఫోటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కనపడితే వాటిని పలువురు ధ్వంసం చేస్తున్నారు.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జయలలిత దోషి అని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇదే కేసులో జయలలిత నెచ్చలి శశికళ, ఆమె వదిన ఇళవరసి, సుధాకరన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభివిస్తున్నారు.

మక్కల్ అథిగారమ్ మూవ్ మెంట్స్
గురువారం చెన్నై నగరంలోని సీఎంబీటీ బస్ స్టాండ్ లో గోడల మీద ఉన్న జయలలిత ఫోటోలు, బ్యానర్లు, ఫెక్సీలు, నేమ్ ప్లేట్లను మక్కల్ అథిగారమ్ మూవ్ మెంట్స్ అనే సంస్థ కార్యకర్తలు తొలగించి నిరసన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు దోషి అని నిర్దారించిన తరువాత జయలలిత ఫోటోలు ఎలా పెడుతారు అంటూ వారు ప్రశ్నించారు.

తమిళనాడు మొత్తం
తమిళనాడులోని అన్ని ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో వెంటనే జయలలిత ఫోటోలను తొలగించాలని మక్కల్ అథిగారమ్ మూవ్ మెంట్స్ సంస్థ కార్యకర్తలు డిమాండ్ చేశారు. జయలలిత ఫోటోలు తొలగించకుంటే మా సంస్థ కార్యకర్తలు వాటిని అక్కడి నుంచి తీసేస్తారని హెచ్చరించారు.

పట్టించుకోని పోలీసులు
బస్ స్టాండ్ లలో జయలలిత ఫోటోలు, ఫ్లెక్సీలు తొలగిస్తున్న సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సైతం పట్టించుకోలేదు. కనీసం వారిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదని జయలలిత అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

శశికళ వర్గీయుల హస్తం ఉందా ?
తమిళనాడులో జయలలిత ఫోటోలు తొలగిస్తున్నారని, ఈ కుట్రలో శశికళ వర్గీయుల హస్తం ఉందని అమ్మ అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత ఫోటోలు తొలగించాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.

మా గుండెల్లో అమ్మ పదిలంగా ఉన్నారు
మీరు గోడల మీద ఉన్న జయలలిత ఫోటోలను తొలగించగలరు కానీ మా గుండెల్లో నుంచి తొలగించలేరని అమ్మ అభిమానులు అంటున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం జయలలిత జ్ఞాపకాలు చెరిపేయాలని ప్రయత్నిస్తున్నారని అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు శశికళ మీద మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications