ప్రముఖ దర్శకుడు కన్నుమూత- కేరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు

తిరువనంతపురం: ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిక్ కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. భార్య సాజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఉదయం సిద్ధిక్.. తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఇంట్లో గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన కోచి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు.

కొంతకాలంగా సిద్ధిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. న్యుమోనియా, కాలేయ సంబంధిత ఇబ్బందులతో చికిత్స తీసుకుంటోన్నారు. అదే సమయంలో ఈ ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అత్యవసర చికిత్సను అందించారు డాక్టర్లు.

Malayala director Siddique passed away

ఏ మాత్రం ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఎక్స్‌ట్రాకార్పొరెల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్ (ఎక్మో) సపోర్ట్‌పై ఉంచారు. మధ్యాహ్న సమయంలో ఆరోగ్యం కొంత మెరుగుపడింది గానీ.. అదే సమయంలోనే గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించింది. ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ రాత్రి 9 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు సిద్ధిక్. స్క్రిప్ రైటర్‌గా వ్యవహరించారు. క్రైమ్ థ్రిల్లర్లను అందించారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ఒకే ఒక్క మూవీ.. మారో. నితిన్ హీరో. తొలుత మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మలయాళ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు.

1989లో రామ్‌జీ రావ్ స్పీకింగ్ సినిమాతో తెరంగేట్రం చేశారు. కోడైరెక్టర్ లాల్‌తో కలిసి అనేక హిట్ సినిమాలకు పనిచేశారు. సిద్ధిక్ లాల్గా పేరు తెచ్చుకుంది వారి ద్వయం. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపీ వంటి మలయాళ అగ్రనటుల సినిమాలకు దర్శకత్వం వహించారు సిద్ధిక్.

మమ్ముట్టి నటించిన హిట్లర్, క్రానిక్ బ్యాచిలర్, బాడీగార్డ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాస్కర్ ద రాస్కల్, ఫక్రీ, భాస్కర్ ఒరు రాస్కల్.. వంటి అనేక హిట్ సినిమాలు సిద్ధిక్ ఖాతాలో ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా.. బిగ్ బ్రదర్. మోహన్ లాల్ హీరో. అర్బాజ్ ఖాన్, అనూప్ మీనన్, హనీ రోజ్.. ఇందులో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+