నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు : జైలు నుంచి బయటకు వచ్చిన హీరో దిలీప్!
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ 57 రోజుల తరువాత మొదటి సారి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆలువాలోని ఆయన ఇంటికి బుధవారం ఉదయం 10 గంటలకు చేరుకున్నారు.
మలయాళం హీరో దిలీప్ తండ్రి వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు అంగమాలి కోర్టులో అర్జీ సమర్పించారు. తండ్రి వర్ధంతి కార్యక్రమంలో దిలీప్ పాల్గొనడానికి పెరోల్ ఇవ్వాలని ఆయన న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు.

దిలీప్ తరపున ఆయన న్యాయవాదులు సమర్పించిన అర్జీ పరిశీలించిన అంగమాలి సెషన్స్ కోర్టు బుధవారం రెండు గంటల పాటు దిలీప్ తన తండ్రి వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇస్తూ పెరోల్ మంజూరు చేసింది.
రెండు గంటల తరువాత మళ్లీ ఆలువా సబ్ జైలుకు చేరుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దిలీప్ ను గట్టి బందోబస్తుతో పోలీసులు అలువాలోని ఆయన ఇంటి దగ్గరకు తీసుకు వచ్చారు. కుటుంబ సభ్యులతో తప్పా ఎవ్వరితో మాట్లాడకూడదని హీరో దిలీప్ కు పోలీసులు సూచించారు. దిలీప్ ను చూసిన వెంటనే ఆయన తల్లి, భార్య కావ్యమాధవన్ బోరునవిలపించారు.












Click it and Unblock the Notifications