నటి కిడ్నాప్, లైంగిక దాడి: మలయాళం హీరో దిలీప్ కు నో బెయిల్: జైల్లో ఓనమ్ పండుగ !

ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ కు కోర్టులో చుక్కెదురైయ్యింది.

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ కు కోర్టులో చుక్కెదురైయ్యింది. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని హీరో దిలీప్ పెట్టుకున్న అర్జీని కేరళ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది.

నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో దిలీప్ కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉన్నందున బెయిల్ ఇవ్వలేమని కేరళ హైకోర్టు చెప్పింది. నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చెయ్యాలని హీరో దిలీప్ కేరళ హైకోర్టులో అర్జీ సమర్పించారు.

 Malayalam actor Dileep clebrate this year Onam at jail

మంగళవారం (ఆగస్టు 29వ తేది) అర్జీ విచారణకు వచ్చింది. దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యరాదని, ఆయనకు నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రమేమయం ఉందని పోలీసులు సరికొత్త సాక్షాదారాలతో పూర్తి నివేదికను కేరళ హైకోర్టులో సమర్పించారు.

హీరో దిలీప్ కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉండటంతో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో జులై 10వ తేదీ అరెస్టు అయిన దిలీప్ ఆలువా సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేరళలో ప్రసిద్ది చెందిన ఓనమ్ పండుగ సైతం ఈ సంవత్సరం దిలీప్ జైల్లోనే జరుపుకోవలసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+