నటి సామూహిక లైంగిక దాడి కేసు: హీరో దిలీప్ కు రిమాండ్ పొడగింపు, పాపం పీపుల్స్ స్టార్ !
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కు మళ్లీ రిమాండ్ విదిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న దిలీప్ ను మంగళవారం అంగమాలి మెజ
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కు మళ్లీ రిమాండ్ విదిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న దిలీప్ ను మంగళవారం అంగమాలి మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేశారు.
ప్రముఖ నటి మీద జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో దిలీప్ హస్తం ఉందని, ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉన్నాయని పోలీసులు కోర్టులో చెప్పారు. అంగమాలి సబ్ జైల్లో ఉన్న దిలీప్ ను న్యాయమూర్తి విచారణ చేశారు.

ఆగస్టు 8వ తేది వరకు దిలీప్ కు రిమాండ్ పొడగిస్తున్నామని న్యాయమూర్తి చెప్పారు. సోమవారం కేరళ హైకోర్టు దిలీప్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దిలీప్ కు వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్షాలు సేకరించారు. సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీకి కిరాయి ఇచ్చి నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేయించారని పోలీసులు అంటున్నారు.
నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసి ఫోటోలు, వీడియో తీస్తే మీకు రూ. 1.50 కోట్లు ఇస్తానని హీరో దిలీప్ పల్సర్ సునీ గ్యాంగ్ తో ఒప్పందం చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో దిలీప్ కింగ్ పిన్ అని, ఆయనకు కచ్చితంగా శిక్ష పడుతుందని కేరళ పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications